విశాఖపట్నం

భావజనితం వౌనరాగాలు (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న కాలంతో పాటే సాహిత్యంలో అనేక వినూత్న ధోరణులు, సరికొత్త రూపాలు, ప్రక్రియలు ప్రవేశించాయి. వేమన పద్యాల నుంచి ఆరుద్ర కూనలమ్మ పదాల వరకు ఎన్నో లఘురూపాలు కన్పిస్తాయి. నేటి కవితా రూపాల్లో హైకూ ఎంతో ప్రాధానత్యత సంతరించుకుంది. తెలుగు సాహిత్యంలో హైకొ ప్రస్తావన తొలిసారిగా రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ శాలివాహనసప్తతి’ అనువాదానికి కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ‘ముందుమాట’లో కనిపిస్తుంది. హైకూ చిన్న కవితాప్రక్రియ. గొప్ప అనుభూతి, భావస్పందనలే విశిష్ట లక్షణంగా నిలిచింది. గోరంతదీపం కొండంత వెలుగు అన్నట్టు హైకూ ప్రక్రియను మంచి సందేశాలను ఇవ్వడానికి ఆధునిక రచయితలు ఉపయోగించుకుంటున్నారు. సగటు పాఠకునికి సయితం అర్థమయ్యేరీతిలో ఇవి ఉంటాయి.
శ్రీకాకుళం భారతి సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు లయన్ పి.శివాజీ పట్నాయక్ రాసిన ‘వౌనరాగాలు’ (2017) పుస్తకం పాఠకులను ఆద్యంతం చదివిస్తుంది. ఊహాలోకాల్లో విహరింపజేస్తుంది. ఉత్తమ కార్యాచరణకు వెలుగు చూపుతుంది. ప్రతి కవిత దేనికదే ప్రత్యేకతతో అలరిస్తుంది. ఈ పుస్తకంలో మొత్తం 199 హైకూలున్నాయి. కొన్ని హైకూలను పరిశీలిద్దాం.
‘వౌనంతో / నీవు / విజయాన్ని / ఉధించుకున్నావు’. వౌనంగానే ఎదగమని రచయిత ఈ కవితలో పేర్కొన్నారు. కంచుమోగునట్లు కనకంబు మోగునా! అనే వేమన పద్యం ఈ సందర్భంగా మనకు గుర్తుకొస్తుంది.
సమాజంలో / సేవతో / మంచినే / సంపాదించు’ ఈ హైకూలో సేవాభావాన్ని అలవరచుకోవాలని మంచి అన్నది పెంచుకోమని సందేశిమిచ్చారు.
‘ఆపదలో / ఉన్నవారిని / ఆప్యాయతతో ఆదరించు’ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవధర్మం. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకొని కూర్చోవడం కంటే చిరుదీపమైనా వెలిగించు అనే సూక్తి అంతర్లీనంగా ఈ కవిత కనిపిస్తుంది.
‘నవ్వును / పరిహసించకు / ఆస్వాదించుకోమరి’ నవ్వు నాలుగు విధాలచేటు అని గతంలో వ్యాఖ్యానించేవారు. అయితే ఇప్పుడు నలభై విధాల లాభమని భాష్యం చెప్పుకోవాలి. నవ్వునీ ఆస్వాదించడంలోనే నిజమైన ఆనందం లభిస్తుందని అన్వయించుకోవాలి.
‘నిరంతరం / పాదసేవ / చేసుకో మాతృమూర్తికి’ జన్మనిచ్చిన తల్లి రుణాన్ని ప్రతి ఒక్కరూ తీర్చుకోవడం కనీస మానవతాధర్మం. జీవితంలో తొలి గురువైన తల్లిని సేవించి తరించమని రచయిత ఉద్భోధించారు.
‘పంచభూతాలే / స్వార్థం / లేనివి / మనకు’ ఈ హైకూలో ఎంతో అంతరార్థం కనిపిస్తుంది. నేటి సమాజంలో ఎక్కువ మంది స్వార్థపరులే ఉన్నారు. ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలు మాత్రమే నిస్వార్థంగానే సేవలందిస్తున్నట్లు కవిభావన.
గుడిగంట / మనశ్శాంతిని / బడిగంట విజ్ఞానానికి గుడిగంట ఆధ్యాత్మిక మనశ్శాంతికి నిదర్శనంగా ఉంటుంది. గుడికి వెళితే దివ్యానుభూతి కలుగుతుంది. బడికి వెళితే అక్షర జ్ఞానం లభిస్తుంది. బడి, గుడి మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతాయి.
సాదా వ్యక్తికి / గౌరవిస్తే / నీకు / ఆదరణే’ ఇతరులను మనం గౌరవిస్తే, వారు మనలను గౌరవిస్తారు. ఈ విషయాన్ని గుర్తెరగాలి. పరస్పరం గసరవించుకోవడం మానవత లక్షణమనే భావనను ఇందులో రచయిత పరోక్షంగా వ్యక్తం చేశారు.
‘నిలకడలేని / మనసులో / ధ్యానం / ఎందుకు? ఏకాగ్రత ధ్యానం లక్షణం. నిలకడలేని మనసుతో ధ్యానం చేసినా అది వ్యర్థమేనని కవిభావన.
‘తొందర / నిర్ణయం / చేతులు /కాల్చుకోడానికే’ నిదానమే ప్రధానం. తొందరపాటు నిర్ణయం ఎంతో ప్రమాదకరం. ఎన్నో దుష్ఫలితాలను చవి చూడాల్సి ఉంటుంది.
‘సొగసు కాదు / ముఖ్యం / శీలం / కాపాడుకొనుట’ అందంగా ఉండడమే కాదు. శీలాన్ని కాపాడుకోవాలి. శీలానికి మించిన ఆభరం మరొకటి లేదు. శీల సంపదతోనే వ్యక్తి కీర్తి, ప్రతిష్ఠలను సముపార్జిస్తాడు.
సంద్రంలో / కెరటాలవలే... నీ జీవిత సుఖదుఃఖాలు’ జీవితాన్ని అదంతా సాగరంతో పోలుస్తారు. ఇందులో సుఖదుఃఖాలు కెరటాల వంటివి. సుఖంలో పొంగిపోకూడదు. దుఃఖంలో కుంగి పోకూడదు.
మంచి / సంస్కృతితో / నీవు / నీరాజనాలందుకో’ ఉత్తమ సంస్కృతిని అలవరచుకోవాలని. తద్వారా సమాజం నుంచి నీరాజనాలందుకో అని రచయిత ఇందులో చక్కని సందేశమిచ్చారు.
ఈ గ్రంథంలో రచయిత శివాజీ పట్నాయక్ పొందుపరచి అందించిన హైకూలు సమాజ హితానికి ఎంతో తోడ్పడతాయి. ఇటీవల కాలంలో విడుదలైన మంచి పుస్తకాల్లో ఇదొకటి.

- కిలపర్తి దాలినాయుడు, సాలూరు-535591, విజయనగరం జిల్లా. సెల్ : 949176329.