విశాఖపట్నం

మార్పు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్పు కోరుకునేవాడు
ముందు తను మారాలి
ఆచరించి చూపాలి
అందరు అధికారులు
అవినీతిపరులే అనుకోవద్దు
ఎందరో ఆదర్శవంతులున్నారు
వారి సాయంతో సమస్య పరిష్కారం
ప్రేమంటే చావు కాదు
ప్రతీకారం అంతకన్నా కాదు
ప్రేమ అర్థం తెలుసుకో ప్రేమ సౌథాన్ని నిర్మించుకో
- గుడిమెట్ల గోపాలకృష్ణ, అరసవిల్లి.

ఫలితమీయని శ్రమ!
నిలకడ లేని మనసుని
నిందించి ప్రయోజనం లేదు
ఫలితం అందాలంటే
ఏకాగ్రతను సాధించక తప్పదు
క్షణాలు నీకు ఎంతగా రుణపడి ఉన్నా
అవకాశాలను తీసుకు రాగలవే కానీ
ఫలితాలను మోసుకు రాలేవు
లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఫలితం చేతికందదు
గుర్తింపు రాదు
గురి ఉంచి సాధన మొదలుపెడితే
విజయం వరించక తప్పదు
గురుగ్రహం మీద గుడారం వేసుకుని
కూర్చున్నా ఫలితం వెదుక్కుంటూ రాకపోదు
- గగనం శ్రీనుకుమార్, పాతవీధి,
యలమంచిలి. సెల్ : 8008829627.

అమ్మప్రేమ
తీపికన్నా తీయనిది ప్రేమ
ప్రేమ కంటే గొప్పది మానవ జన్మ
జన్మనిచ్చే అమ్మ కంటే తీయనిది
సృష్టిలో ఏదీ లేనే లేదు
అమ్మ లేక జన్మ లేదు
జన్మ లేక జీవితం లేదు
జీవితం లేక ఏదీ లేదు
అమ్మ లేక ప్రేమ లేదు
అమ్మ మాట మధురం మధురం
అమ్మ మాట వేదం వేదం
అమ్మ మాట మననం మననం
అమ్మ చేయూత మహిమాన్వితం
- ఎ. నాగభూషణం, బాబామెట్ట,
విజయనగరం. సెల్ : 8985916755.

డబ్బులిచ్చే ప్రియా
ప్రియా నువ్వే గుర్తొస్తావ్
సినిమా టిక్కెట్ తీసినప్పుడు
హోటల్లో టిఫిన్ తిన్నప్పుడు
పార్లర్‌లో ఐస్‌క్రీం తిన్నప్పుడు
ఆటోలో ప్రయాణించినప్పుడు
శారీమందిర్‌లో చీరలు కొన్నప్పుడు
రైతుబజార్లో కూరగాయలు
మటన్ షాపులో మటన్ కొన్నప్పుడు
ప్రియా నువ్వే గుర్తొస్తావ్
నా వెనుక నీవుంటే
నాకెంత ధైర్యమో తెలుసా?
ఆ డబ్బులన్ని నీవిస్తావని
నాకెంత కష్టంగా ఉందో నీకు తెలుసా?
పర్సులో నుండి డబ్బు తీస్తున్నప్పుడు
నీవు లేని లోటు స్పష్టంగా కనిపించింది
నా కోసం వేగిరం రావా
నా ప్రియమైన ప్రేమికుడా
- మల్లారెడ్డి రామకృష్ణ,
సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 8985920620.

స్వైన్‌ఫ్లూ
మిత్రమా
స్వైన్‌ఫ్లూ ప్రాణాంతక అంటువ్యాధి
లింగభేదం చూపని రోగమది
సాధారణ ఫ్లూ లక్షణాలే దీనికీ ఉన్నా
ప్రాణాలను హరించే ప్రమాదం పొంచి ఉంది
ఇన్‌ఫ్లూయెంజా- ఎ, హెచ్ ఎన్, వైరస్
అతి భయంకరమైనది
జలుబు, దగ్గు, జ్వరమని నిర్లక్ష్యం చేయకు
భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకో
పుణ్యక్షేత్రాలు, సినిమా థియేటర్లకు
వెళ్లడం తగ్గించుకో
స్వైన్‌ఫ్లూ రోగి వస్తు సామగ్రిని
నువ్వు ముట్టుకున్నా
రాక మానదు వీరవిహారంతో స్వైన్‌ఫ్లూ
నీ ఇంటిని, ఒంటిని, పరిసరాలను శుభ్రపరచుకో
పల్లెలు, గ్రామ ప్రజలను హెచ్చరించు
ఇన్‌ఫ్లూయెంజా- ఎ, హెచ్ ఎన్ వైరస్
జన సమూహాన్ని చిటికెలో
నేలమట్టం చేయగల నేర్పరి
గర్భిణులు, అయిదేళ్లలోపు పిల్లలను,
వృద్ధులు, డయాబెటిస్ రోగులను
ఇది ఆశ్రయించక మానదు
ఇతరులను రక్షించి నిన్ను నువ్వు కాపాడుకో
స్వైన్‌ఫ్లూ అతి భయంకరమైన అంటువ్యాధి
నివారణ దీనికి సులభ మార్గం
ప్రయత్నించి చూడు పై సూచనలతో
ముక్కుకు మాస్క్ మరచితివో ముప్పు తప్పదు
నీ బంగారు భవితవ్యానికి
ఇన్‌ఫ్లూయెంజా- ఎ, ఎ హెచ్ ఎన్ వైరస్
జీవితాలను తుడిచిపెట్టగల మహమ్మారి
నీతో పాటు పదుగురిని రక్షించి
దేశ పురోభివృద్ధికి పాటు బడి
భరతమాత రుణం కొంతైనా తీర్చుకో
- రాయవరపు సరస్వతి,
చోడవరం పోస్టు,
విశాఖ జిల్లా - 531036.