డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 102

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవేవీ అర్థంకాని ఉష నిద్రపోయింది, నోట్లో వేలు వేసుకుని.
తెలతెలవారకుండానే వౌళి బయలుదేరాడు.
‘‘వౌళి ఇంత చీకట్లోనా’’ అన్నాను.
లేదమ్మా- చాలామంది అక్కడే ఉండిపోయారు. నేనే ఉషతో నువ్వు ఒంటరిగా వుండిపోయావని వచ్చాను. మూర్తిగారు కూడా బయలుదేరాడు. సావిత్రి వస్తానంది కాని మూర్తిగారు వద్దన్నారు. నేను ప్రతి అరగంటికి పిలిచి చెప్తాను. నువ్వు నా ఫోను పట్టుక్కూచో అంటూ.
తెల్లవారుతోంది- టైము మెల్లిగా గడుస్తోంది. ఇంతవరకు ఏ వార్త తెలియడంలేదు. టైమ్ 8.15. నిన్న ఇదే టైముకు మొదలయింది మారణహోమం. 24 గంటలు. ట్విన్ టవర్స్‌దాని చుట్టుపక్కనున్న మరో 7 టవర్స్ అగ్నిహోత్రుడికి ఆహుతి అయిపోయాయి. ఆ ప్రాంతం నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. అవిరామంగా అక్కడ సర్వైవర్స్ కోసం వెదకడం జరుగుతూనే ఉంది. టీవీ ప్రచారం చేస్తూనే వుంది.
నడుస్తున్న ప్రతిక్షణం గుండెలమీద గుప్పిటతో కొడుతున్నట్లుగా వుంది. మూర్తిగారు మధ్య మధ్య ఫోన్ చేస్తూనే ఉన్నారు, చెప్పడానికి ఏ వార్తాలేకపోయినా.
ఇక మధ్యాహ్నం అవుతోంది. నా నమ్మకం కూడా హరించిపోవడం మొదలుపెట్టింది. నా మూగ ప్రార్థనలు భగవంతుడికి వినిపించడంలేదు. ఎన్నివేల కుటుంబాలు నాకు మల్లెనే ప్రార్థిస్తున్నారో!
వౌళి ఫోను చేశాడు, ఉష ఎలా వుందో అని. వాడి కంఠం నిరాశా నిరుత్సాహాలతో నిండిపోయింది.
‘‘లేదమ్మా- ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. వీళ్ల మాటలు బట్టి ఇంక ప్రాణాలతో దొరకడం కష్టం’’ అంటున్నారు. వాడి కంఠం దుఃఖంతో పూడిపోతోంది.
వౌళి! టీవీలో ఇప్పటికి 56మంది దొరికారు అంటున్నారు. వాళ్లందరినీ అక్కడే వుంచారా!
‘‘ఇక్కడ ప్రాథమిక వైద్యం చేసి దగ్గరలో హాస్పిటల్‌కి పంపేస్తున్నారు’’ అన్నాడు.
నువ్వు తేజాది పెద్ద ఫొటో తీసుకువెళ్ళావు గదా, దాన్ని తీసుకుని, ఆ దగ్గరలో వున్న హాస్పిటల్‌లో అడిగిచూడు. తేజాని ఎవరైనా గుర్తుపట్టగలరేమో!
ఇంతలో వౌళితో మాట్లాడుతుంటే మరో ఫోను వస్తున్నట్లుగా సిగ్నల్ వచ్చింది. ‘‘వౌళి మరో ఫోన్ వస్తోంది. ఒక్క క్షణం ఆగు’’ అంటూ రెండో ఫోన్‌లో మాట్లాడడానికి బటన్ నొక్కాను. ఆ టెలిఫోన్‌మీద ఏదో హాస్పిటల్ పేరులా అనిపించగానే వౌళి సమాధానంకి కూడా ఆగలేదు.
అది ఒక హాస్పిటల్‌నుండి.
రెండు గంటల క్రితమే ఒక అమ్మాయిని తెచ్చారుట అంబులెన్స్‌లో. ఆ అమ్మాయి మెడలో వున్న ఉద్యోగపు తాలూకు ఫొటో ఐడెంటిటీ కార్డుమీద పేరును బట్టి రుూ నెంబర్ ట్రేస్ చేసి పిలుస్తున్నారుట.
ఆనందం అనేది కేవలం మూడు అక్షరాలు మాత్రమే! కాని దాని అనుభవం అనిర్వచనీయమైంది. అనంతం. ఇంతవరకు నా జీవితంలో ఏ ఒక్క విషయము ఇటువంటి భావన కలిగించలేదు. నాలో ఉద్వేగం ఆపుకోలేకపోయాను. హృదయంలో ఆరిపోతున్న ఆశాజ్యోతికి ఆజ్యం పోశాడు భగవంతుడు.
తేజాని హాస్పిటల్‌లో చేర్చారుట- పెద్దగా అరిచాను. నా గొంతు అంత గట్టిగా అరవగలదని నాకే తెలియదు. పక్క గదిలో మూర్తిగారితో మాట్లాడుతున్న సావిత్రి పరుగులమీద వచ్చేసింది.
వెంటనే వౌళికి ఫోను చేశాను. వాడు నా ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నాడు. వెంటనే ఎత్తాడు. ‘‘వౌళి! మూర్తిగారు నీతోనే ఉన్నారా’’ అన్నాను. ‘‘అవును ఎందుకు?’’ అడిగాడు భయం భయంగా.
‘‘అయితే విను- తేజా మన్‌హటన్‌లో వున్న హాస్పిటల్‌లో చేర్చారుట’’ అన్నాను వణుకుతున్న కంఠంతో. ఎటువంటి సందర్భంలోనూ నాకు, వౌళి క్షేమమే నా మనసు ఆలోచిస్తుంది. నాకే ఇంత ఉద్వేగంగా ఉంటే వాడెలా ఉంటాడో- అందుకే పక్కన మూర్తిగారు వున్నారా అని అడిగాను’’.
‘‘ఓ గాడ్! ఓ మై గాడ్’’ అన్నాడు వౌళి నమ్మలేనట్లుగా. థాంక్యూ.
‘‘ఎలా వుంది’’ అడిగాడు.
‘‘వీళ్లేమీ చెప్పలేరుట. పిలిచింది హాస్పిటల్ వాళ్లు కాదు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ట. వీళ్లు దొరికినవాళ్ల ఆచూకీ విచారించే గ్రూపట’’ అన్నాను.
‘‘ఇప్పుడే అక్కడికి వెడుతున్నాను. అక్కడినుంచి ఫోన్ చేస్తాను’’ అన్నాడు.
నేనూ, సావిత్రి ఒకరి మొహాలు ఒకరు చూచుకున్నాం. సావిత్రి భళ్లున ఏడ్చేసింది ఆనందంతో.
నాకు, దుఃఖంలోనూ, సంతోషంలోనూ కూడా ఎప్పుడూ ఒక్కటే గుర్తుకువస్తుంది. గబగబా దేముడి ఫొటో ముందు నుంచున్నాను. దీపం వెలిగించి దండం పెట్టాను.
‘‘నా మొరాలకించావు భగవంతుడా. రుూ కుటుంబాన్ని చల్లగా చూడు! ఆనంద బాష్పాలు కళ్లనుండి జారిపోతున్నాయి. వాటిని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. అవిరామంగా జారుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యధ. అంత త్వరగా కరగదు’’.
దాదాపు ఒక యుగం గడిచింది అనిపించాక మూర్తిగారు ఫోన్ చేశారు.
‘‘ఇంతసేపు అయ్యిందేం’’ ఖయ్యిమంది సావిత్రి.
అక్కడినుండి రుూ హాస్పిటల్ చేరుకునేటప్పటికే ఇంత ఆలస్యం అయింది అన్నాడు మూర్తిగారు. మేమింకా తేజాని చూడలేదు. డాక్టర్స్ చూస్తున్నారుట. స్పృహలో లేదుట అన్నారు.
సావిత్రి తనూ వెళ్తానంది హాస్పిటల్‌కి. తల్లి మనసు ఎంత ఆక్రోశిస్తోందో అర్థం చేసుకోగలను.
‘‘ఒక్కరూ వెళ్లగలరా!’’ అన్నాను. ఆ న్యూయార్క్ ఓ మహాసముద్రం. అందులో ఈ విధ్వంసం తరువాత ఎలా వుందో నాకు తెలియదు’’.
తల ఊగించింది. నేను ఉష క్రిబ్ దగ్గరకు వెళ్ళాను. అప్పుడే లేస్తున్న దాన్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాను. నన్ను చూడంగానే నవ్వింది. ఇప్పుడే మనుషులను చూడంగానే నవ్వుతోంది.
‘‘నవ్వరా పండు నవ్వు, నవ్వాలనిపించినంతసేపు నవ్వు. అమ్మ దొరికింది’’ అంటూ ముద్దుపెట్టుకున్నాను.
సావిత్రి టాక్సీకోసం ఎదురుచూస్తోంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఎదురుగా లత. ఫిలడెల్ఫియాలో చదువుకుంటోంది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి