భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా మీ నమ్మకం వల్లనే జరుగుతుంది. ఏదైనా మీరు భగవంతుని నమ్మి ఆయన దారిలో వెళితే ఎప్పుడూ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతుంటాడు. భగవద్గీతలో కృష్ణుడు మీరు నమ్ము నమ్మండి, మీ పనులు మీరు చేయండి. మీకు ఇవ్వవలసిన ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పలేదా? దాన్ని మీరు ఎందుకు మరిచిపోతారు అన్నాడు సాయి.
అవును సాయి అంతా నీదే భారం అన్నాడు. నాడు కృష్ణయ్య చెప్పినా నేడు నీవు చెప్పినా మాకు మాత్రం నీవే కిష్టయ్యవు అంటూ అందరూ సాయికి నమస్కరించారు.
నందరామ్ నిన్న ఒక విషయం జరిగింది మసీదులో తెలుసా నీకు అంటూ వెంకన్న నందరామ్ ఇంటికి వచ్చాడు.
‘ఏ విషయం’ అడిగాడు నందరామ్.
నిన్న మన శిరిడీకి బొంబాయి నుంచి శివయ్య అనునతడు వచ్చాడు. ఇక్కడ ఒకస్వామి అవధూత ఉన్నారని తెలిసి వచ్చాను. మీకేదైనా ఆయన గురించి తెలుసా? ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయట. నేను ఆయన్ను చూడాలని అని గుర్రం మీద వచ్చాడు.
నన్ను ఈ సంగతి అడిగాడు. నేను అన్నాను, అవధూత కాదు శిరిడీలో ఉండేది బాబా. ఇదుగో ఈ మసీదులోనే ఉన్నాడు, పద పోదాం రండి అని పిలిచాను.
ఆయన అన్నాడు. ఆయన తురకవాడు. అవధూత బ్రాహ్మణు డు. మసీదులో ఆయన ఎందుకు ఉంటాడు. అయినా చూద్దాం పదండి అన్నాడు. నేను ఆయన్ను బాబా దగ్గరకు తీసుకుని వెళ్లాను.
మసీదులో ఆగ్నేయ దిక్కున ఉన్న అగ్నిని చూసి ఇదేంటి ఇక్కడ అగ్నిహోత్రం పెట్టి ఉంది అన్నాడు. నేను చెప్పాను, అది ధుని ఎప్పుడూ రగులుతూ ఉంటుంది.
ఇదిగోండి, ఇక్కడ ఈ గూట్లో బాబా చిలుము తాగుతారు. దానికి సంబంధించిన ఈ గొట్టాలు గుడ్డ సటకా ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడే కుండలతో ఎప్పుడూ నీళ్లు పెట్టి ఉంటారు బాబా. వీటితోనే ఇక్కడ ఉన్న తోటలో చెట్లకు నీళ్లు పోస్తారు అని అన్నాను.
బాబా అంటున్నావు ఆయన ఎక్కడ ఉన్నారు అని అడిగారు.
ఎప్పుడూ ఇక్కడే ఉండేవారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో నేను చూడలేదు. బహుశా అలా తిరిగి రావడానికి వెళ్లి ఉన్నారేమో నాకు తెలియదు.
అయినా మీరు అవధూత అన్నారు కదా, ఆయన ఏం చేస్తాడు అని నేను అడిగాను. అవధూత అంటే నీకు అర్థం కాదులే నేను చెప్తే అంటూ, తిరగలి చూసి ఇదేంటి ఇక్కడ ఉంది అన్నారు. నేను చెప్పాను. అప్పుడప్పుడు గోధుమలు తెచ్చి దీంట్లో బాబా విసురుతూ ఉంటారు. ఇలా విసరగా వచ్చిన పిండిని ఊరి పొలిమేరల్లో చల్లుతుంటారు అని చెప్పాను. అక్కడే లక్ష్మీబాయి అలా బాబా చేయడంవల్లే ఈ ఊరికి ఏ వ్యాధులు రావడంలేదు అంది.
ఆయన ఏమిటి ఈ పిండిచల్లితే వ్యాధులు రావా? అదేంటి నాకేమి బోధపడడంలేదు అన్నారు. చాలాసేపు బాబాకోసం కూర్చున్నారు. ఆయన ఉన్నంతసేపు బాబా రానేలేదు. కాని, చిత్రం ఏమిటో తెలుసా. ఆయన అలా వెళ్లారో లేదో అంటే నేనే ఆయనతో వెళ్లి ఆయన గుర్రం మీద కూర్చుని వెళ్ళేవరకు ఆయనతోటి ఉన్నాను. తిరిగి ఈ బాబా ఎక్కడికి వెళ్లారో అనుకొంటూ నేను తిరిగి మసీదులోకి వెళ్లాను. బాబా ఆ గోనె పట్టాల మీద కూర్చుని ఉన్నారు. అదీ ఎప్పటినుంచో ఉన్నట్టు. ఏమిటి నీ స్నేహితుడు అవధూతను చూడకుండానే వెళ్లిపోయాడా అంటూ నన్ను అడుగుతూ నవ్వాడు బాబా.
నేను ఆశ్చర్యంగా చూసి బాబా అన్నాను.
నిజమే కదా. నేను అవధూతను చూడాలని ఒకరు వచ్చారు కదా. వారిని నీవు ఈ మసీదులోకి తీసుకువచ్చావు కదా అన్నాడు బాబా.
అవును అని చెప్పబోతుంటే లక్ష్మీబాయి అంది బాబా ఆయనకు చాలా అనుమానాలు ఉన్నాయి. నేను ఈ గోధుమల పిండిని మీరు ఊరి పొలిమేరల్లో చల్లుతారు, అప్పుడు వ్యాధులు రావు అంటూ. అదేంటి అన్నాడాయన అంది.
అవును కదా. నేను ఈ గోధుమలు తిప్పేది మీ పాపాలను అరగదీయడానికి. అందుకని ఆయన అలా అని ఉంటారులే అన్నాడు బాబా.
నేను ఏంటి బాబా అలా అంటున్నారు. కాని మీరు ఎక్కడికి వెళ్లారు. ఆయన ఎంతోసేపు మీకోసం చూశారు. ఇప్పుడే అటు వెళ్లారు. మీరు ఇక్కడే ఉన్నారు అన్నాను.
మరీ బాగుంది నేను ఎక్కడికి పోయాను వెంకన్నా అసలునేను ఎక్కడ ఉన్నాను అన్నాడు బాబా.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743