డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-104

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేము బయట నిలబడిపోయి వుండటం చూచి.
గదిలో వున్న తక్కిన డాక్టర్స్ అందరికి వౌళిని పరిచయం చేశాడు. ఆ కొత్త డాక్టర్స్ ముగ్గురిని పేరు, వాళ్ల స్పెషాలిటీ కలిపి పరిచయం చేశాడు. వీళ్లంతా బోస్టన్ నుండి వచ్చారు డాక్టర్ రఘురామ్ రిక్వెస్ట్ చేసినందువల్ల అన్నాడు.
సావిత్రి, మూర్తిగారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాళ్లు రఘురామ్‌ని ఎప్పుడూ చూడలేదు. డా వాకర్ మళ్లీ అన్నాడు మా ముగ్గురి వంకా చూపిస్తూ తేజాస్ పేరెంట్స్ అండ్ వౌళీస్ మదర్ అని.
బోస్టన్ నుండి వచ్చిన డాక్టర్స్ షేక్‌హాండ్స్ ఇచ్చేవారేమో! నేను ముందుగానే రెండు చేతులు జోడించాను. మూర్తిగారు మాత్రం రఘురామ్‌కి షేక్‌హాండ్ ఇస్తూ, ఇట్ ఈజ్ ఎ ఆనర్ టు మీట్ యూ, ఐ ఓన్లీ విష్ ఇట్స్ ఇన్ ఎ డిఫరెంట్ సర్కకమ్‌స్టెనె్సస్’’ అన్నాడు.
రఘురామ్ అర్థమయినట్లు తల వూగించాడు.
ఆ గదిలోకి అడుగుపెట్టినప్పటినుంచి అతని కళ్లు నన్ను గమనిస్తూన్నట్లే అనిపించసాగింది. అందుకని నేనే నా కళ్లు మరల్చుకుని, తేజా పక్కగా నడిచాను. నా పక్కనే సావిత్రి కూడా వచ్చింది.
మొదటిరోజుకంటే కొంచెం వాపులు తగ్గినట్లు అనిపించాయి. ఇప్పుడు తేజాయే అని గుర్తుపట్టేట్లుగా వుంది.
సావిత్రి తేజా చేతిని నిమురుతూ, ‘‘తేజా, అమ్మడూ’’ అని పిలుస్తూనే వుంది. అయినా తేజాలో ఎటువంటి చలనమూ లేదు.
తేజాకి రొటీన్‌గా చేయించిన ఏ టెస్టులోనూ ఏ ప్రమాదమూ కనిపించలేదు. బ్రెయిన్‌కి దెబ్బకాని కనిపించడంలేదు. అయినా తేజాకి ఎందుకు మెలకువ రావడంలేదో వాళ్లకు అర్థం కావడంలేదు.
తేజా అడ్మిట్ అయినప్పటినుంచి క్లోజ్‌గా ఫాలో అవుతున్న రఘురామ్, హార్వర్డ్ నుండి తనకు పరిచయమున్న ప్రపంచ విఖ్యాతులని పిలిపించాడు.
బోస్టన్ నుంచి వచ్చిన న్యూరాలజిస్ట్, ఏవేవో కొత్త టెస్టులు చేయించమని సూచనలిచ్చాడు డాక్టర్ వాకర్‌కి. అలాగే ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఆదేశాలు ఇచ్చాడు.
అందరూ రూమ్ ఖాళీ చేశారు. వౌళి, తేజా చేతిని తన చేతిలో వుంచుకుని వుండిపోయాడు. మూర్తిగారు మాత్రం ఆ డాక్టర్స్ అందరితో నడిచి ఎస్కలేటర్‌దాకా వెళ్లారు.
తిరిగి వచ్చిన మూర్తిగారు అన్నారు.
‘‘ఈ టెస్ట్స్ అన్నీ చేయించాక తేజాకి ఏం చేయాలో నిర్థారిస్తారుట. వైటల్ సైన్స్ అన్నీ బాగున్నాయి. ప్రాణభయం లేదు. మాటర్ ఆఫ్ టైమ్ అంటున్నారు’’ అన్నాడు.
ఆ రాత్రి సావిత్రితో మాట్లాడుతున్న మూర్తిగారి మాటలు నా చెవిలో పడుతూనే వున్నాయి, ఎంత మెల్లిగా మాట్లాడుకుంటున్నా.
‘‘ఎంత యాదృచ్ఛికం? ఆయన తాలూకు ఎవరో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పనిచేస్తారుట. వాళ్ల ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఆ వెతుకులాటలోనే రఘురామ్‌గారు యిలా హాస్పిటల్‌కి వచ్చారుట.
‘‘ఎమర్జెన్సీ రూమ్‌లో కల్యాణిగారిని చూచి ఆశ్చర్యపోయి ఆగిపోయాడు. మూడు రోజుల నుంచి పొద్దునా సాయంత్రం హాస్పిటల్‌కు వస్తూనే వున్నారుట. నిన్న వౌళి రూమ్ కోసం చేస్తున్న ప్రయత్నం చూచి, ఆయనే చీఫ్ ఎడ్మినిస్ట్రేటర్‌తో మాట్లాడారు. ఆయనకి రుూ హాస్పిటల్‌తో చాలా పెద్ద కనెక్షన్ వుంది’’ అన్నారు.
ఈ ఈస్ట్‌కోస్ట్‌లో పెద్ద పెద్ద నోటెడ్ డాక్టర్స్ అంతా అతనికి తెలుసు.
‘‘అది తెలుస్తూనే వుంది కదా! అంత పెద్ద డాక్టర్స్ బోస్టన్ నుండి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చారంటే’’ అంటోంది సావిత్రి.
‘‘తేజా ఆయన నీస్ అనుకుంటున్నారు!’’ అన్నాడు మూర్తిగారు.
‘‘నీస్’’
‘‘నీస్’’ మనసులో మరోసారి అనుకున్నాను.
‘‘వౌళి ముఖం చూచారా ఎంత వివర్ణమయిపోయిందో’’ అంటోంది సావిత్రి.
‘‘పాపం ఆవిడకేమనిపించిందో! హఠాత్తుగా అక్కడ ఆయన కనిపించేటప్పటికి’’ సావిత్రి కంఠంలో సానుభూతి తొంగిచూస్తోంది.
34 సంవత్సరాల తరువాత మళ్లీ చూస్తున్నాను. 30 ఏళ్ళ తరువాత, అతని కంఠం మళ్లీ విన్నాను. ఏమనిపిస్తోందో సావిత్రి సానుభూతి!
నేను జాలి, సానుభూతి భరించలేను. ఆ బలహీనతను నేను వదల్చుకోలేను.
ఏమనిపిస్తుంది ఎవరికైనా? చావుబతుకుల్లో వున్న కోడలికి సహాయపడటానికి వచ్చిన మనిషి గూర్చి? కొడుకు జీవితం ఛిన్నాభిన్నం కాకుండా చేయి అందించబోయిన వ్యక్తిని గురించి ఏమనిపిస్తుంది?
రఘురామ్‌తో నాకు శతృత్వం లేదు. అహస్యం అంతకన్నా లేదు. ఒకప్పుడు కోపం వుండేది. యిప్పుడు అదీ లేదు.
కేవలం ఒక పక్క డిస్సప్పాయింట్‌మెంట్. మరోపక్క ఎడ్మిరేషన్.
ఊహించనంతగా వృత్తిపరంగా ఎదిగిపోయి ఆకాశాన్నంటిన ఒక విజ్ఞాన శిఖరంని తలచుకుంటే ఎనలేని ఎడ్మిరేషన్.
ఊహకందనంతగా, వ్యక్తిగతంగా శిథిలమయిన సంస్కారాన్ని చూస్తే డిస్సప్పాయింట్‌మెంట్. వృత్తి, ప్రవృత్తి జంట శిఖరాలు. ఒక వ్యక్తిని ఆరాధించినా, అంగీకరించలేకపోయినా దాని వెనుక ఒక అనుబంధం వుంటుందా?
ఏమో? ఉండవచ్చు.
లేచి వౌళి గదిలోకి వెళ్లాను. తేజ రోజూ పాపాయిని ఎత్తుకుని కూచునే రాకింగ్ ఛైర్‌లో కూర్చుని ఉన్నాడు. చేతుల్లో ఉష నిద్రపోతోంది.
వాడి చేతుల్లో వున్న ఉషని తీసుకువెళ్లి క్రిబ్‌లో పడుకోపెట్టాను.
వౌళి వెనుకగా వెళ్లి వాడి భుజాలమీద చేయివేశాను. ‘ఆర్ యు ఓకె’ అడిగాను.
మెల్లిగా తల వూగించాడు. కుర్చీలోంచి లేచి పెద్ద విండో దగ్గరకు వెళ్లాడు. బయట చంద్రుడు అందంగా కనుపిస్తూన్నాడు. కాని ఆస్వాదనలోనే లోపం వుంది.
‘‘నాకెందుకో భయంగా వుందమ్మా. ఏం కారణం కనుపించకుండా, తేజాకి ఎందుకు మెలుకువ రావడంలేదో. బలంగా నిట్టూర్చాడు.
చాలా చాలా పెద్ద డాక్టర్లే చూస్తున్నారు కదా. త్వరలోనే తెలుస్తుంది. సరైన వైద్యం జరుగుతోంది. నువ్వు ధైర్యంగా వుండు.
-ఇంకాఉంది