భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నాళ్లకు ఏమైందో ఏమో తెలియదు కాని శిరిడీలో ఉన్న తంబూలి దగ్గరకు ఎవరికీ తాయెత్తులకోసం వెళ్ళే అవసరం రాలేదు. మొహుద్దీన్ నేను చాలా తప్పు చేశాను నేను చాలా తప్పు చేశాను అని అందరితో చెప్పడం మొదలెట్టాడు. వారంతా తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడూ చేయకు అనేవారు.
కాని తంబూలీ మొహుద్దీన్‌లో చాలా మార్పు వచ్చింది. ఆయన అదివరకులా ఎవరితో గొడవలు పెట్టుకోవడంలేదు. పైగా అందరినీ అమ్మా అక్కా అన్నా నన్ను క్షమించండి అని అడుగుతున్నాడు.
ఒకరోజు మహిల్సాపతి దగ్గరకు మొహుద్దీన్ వచ్చాడు.
‘‘బాబా మీరు నాకో సాయం చేయాలి’’ మొహుద్దీన్ అన్నాడు.
‘‘అదేంటి నీకు చాలా శక్తులు ఉన్నాయి కదా. నేను నీకు సాయం చేయడం ఏమిటి’’ అన్నాడు మహిల్సాపతి.
‘‘తప్పు అయిపోయింది. మీరు హేమాదిపంతు ఇంకా ఈ ఊరి పెద్దలంతా నాతో బాబా దగ్గరకు రండి. నేను ఆయన్ను నన్ను క్షమించమని అడుగుతాను. ఆయనతో మీరు కూడా చెప్పండి. నేను ఇంతకుముందులాగా మొద్దువాడిని కాదు. నాకు బాబా గొప్పతనం తెలిసింది. ఆ రోజు కూడా కుస్తీ పోటీల్లో బాబా కావాలనే ఓడిపోయాడు. నిజానికి ఆయనే గెలిచాడు.
కాని ఆ సంగతి తెలియకుండా నేను గెలిచినట్లు చేశాడు. అయినా ఆయన్ను నేను తూలనాడాను. అందుకే ఇప్పుడు మీ అందరి ముందు ఆయన్ను నేను క్షమించమని అడుగుతాను. మనందరం కలిసి బాబాను తిరిగి ఈ శిరిడీకి తీసుకునివద్దాం.
అప్పటిదాకా నా మనసు నా మాట వినడంలేదు. నేను చాలా తప్పు చేశాను. మీరంతా నన్ను క్షమించండి అని పదే పదే చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు మొహుద్దీన్.
అతడి దీన పరిస్థితి చూసి మహిల్సాపతి మిగతావారి అందరి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. వారందరి దగ్గర తన మనసుపడే ఆవేదనను చెప్పాడు మొహుద్దీన్.
చివరకు అంతా కలిసి బాబా దగ్గరకు వెళ్లారు. మొహుద్దీన్ బాబా కాళ్ల మీదపడి తన్ను క్షమించని కోరాడు.
ఆ తరువాత అంతా విషయం చెప్పాడు.
అందరూ కూడా మొహుద్దీన్ వారితో చెప్పింది విన్నాడు.
బాబా అంతా విని మొహుద్దీన్ ఏమైంది. ఎక్కడ ఉంటే ఏముంది. నేను ఇక్కడే ఉంటానులే. నీవే కదా నేను ఉన్న చోట ఉండను అన్నావు. మరలా ఇప్పుడు ఎందుకిలా మారుతున్నావు. ఊరి ఊరికినే మారేటట్లు అయితే ఏ విషయంలోనైనా తంటానే వస్తుంది.
కొన్నాళ్లకు మళ్లీ నీ మనసు మారవచ్చు. అందుకే నేను ఇక్కడే ఉంటాను.
నీవు అక్కడే ఉండు. నీకు నన్ను చూడాలనిపిస్తే నీవు రా. నాకేమీ నీ మీద కోపం లేదు. ఒకవేళ నాకు నిన్ను చూడాలనిపిస్తే నేనే వస్తాను నీ దగ్గరకు. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు అన్నారు.
కాని పట్టిన పట్టు వీడలేదు మొహుద్దీన్. బాబాను తప్పక శిరిడీలోనే ఉండాలి అని అన్నాడు. అందరూ కూడా అదే చెప్పారు. ఇట్లా అందరూ ఒకే మాట చెప్పేసరికి బాబా కూడా చిరునవ్వుతో సరే మీరు చెప్పినట్లే నేను చేస్తాను అని అంటూ వారితో పాటు బాబా శిరిడీలోకి వచ్చారు.
ఇక అప్పుడు అందరూ ఎంతో సంతోషంతో బాబాను తీసుకుని వెళ్లారు.
అలా బాబా శిరిడీలోని మసీదుకు మకాం మార్చారు.
మళ్లీ కొన్నాళ్ల తరువాత..
శిరిడీలోని ప్రజలకు మతం గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు. అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఎవరికిష్టమైన పండుగలను వారు చేసుకొనేవారు. ఎవరి ఆచార సంప్రదాయలను బట్టి వారు చేసుకొంటూండేవారు. ముస్లింల పండుగ వస్తే వారు హిందువులకు మంచి తీయని పదార్థాలను వీరికి పెట్టేవారు. హిందువుల పండుగలు వచ్చినపుడు వీరు తీయని పదార్థాలు వారికి పెట్టేవారు. అంతేకాని ఎప్పుడు వారి మధ్య తగవులాటలు ఉండేవి కావు.
ఇలా ఉండగా ఒకసారి శిరిడీలో ఒక ముస్లిం ఇంటికి జహ్వర్ అలీ అనే అతను వచ్చాడు. వచ్చినప్పటినుంచి ఏంటి మన వాళ్ళు ఆ హిందువులతో కలిసి తిరుగుతారు. ఏమిటి నాకేమి నచ్చడంలేదు అని అనేవాడు. ఆ ఇంటి యజమాని ఒకసారి గట్టిగా చెప్పాడు. అలీ ఏదో దూరపు చుట్టం కనుక ఇంటికి వచ్చావని మేము నిన్ను భరిస్తున్నాము. మేమంతా కలిసి ఉంటాము. ఇక్కడ ఇంతే ఉంటుంది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743