నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తిలలును నీళ్లును వస్త్రం
బులుఁ బుష్పసుగంధ వాసనమున సౌరభముం
బొలు పెసఁగ దాల్చుఁ గావున
నలయక సత్సంగమమున నగు సద్గుణముల్
భావం: పాండవులు అరణ్యవాసానికి వెళ్తుతుండగా ప్రజలు ఇక దుష్టచతుష్టయంతో ఉన్న దుర్యోధనునిపాలన లో ఉంటే మనకు కూడా ఆ పాపం సంక్రమిస్తుంది కనుక మనం ధర్మాచరణులైన పాండవులతో వెళ్లి పోదాం అనుకొన్నారు. అపుడు నువ్వులు, నీళ్లు, గుడ్డలు, పువ్వుల పరిమళ సంపర్కం వలన సుగంథాన్ని సంపాదించుకున్నట్లు సజ్జన సహవాసం చేత ఆశ్రమంగా జనులకు సద్గుణాలు అలవడతాయి అని అనుకొన్నారు. మల్లెల వాసన మల్లెలు కట్టిన గుడ్డకు కూడా అబ్బినట్లే మంచివారితో ఉంటే మంచిగుణాలు అలవడుతాయి అన్నది ఈ పద్య భావం.
*
మహాభారతంలోని పద్యము