వీరాజీయం

చెత్త తినెడు మత్త్భేం చెరకు తినునా? (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పు తినెడు కుక్క చెరుకు తీపి ఏమి ఎరుగురా? అన్న యోగి వేమన్జీకి ఏనుగులు మాత్రమే చెరుకు రుచిని మరిగిన జంతువులూ అని నమ్మకం ఉందేమో కాని, కలికాలం వచ్చింది. కుక్కలు పందులు స్వైర విహారం చేసే చెత్త గుట్టల్లో పశ్చిమ బెంగాల్‌లోని బోమఖడి అడవికి దగ్గరగా వున్న నగర శివారుకు ఏనుగులు చెత్త కంపుని ఆఘ్రాణిస్తూ వచ్చి పెంట కుప్పలను కుమ్మి ప్లాస్టిక్ మూటలో సహా అమిత మక్కువగా అక్కడి చెత్తని ఆరగించేస్తున్నాయి. సమీప నగర వాసులు రంగు రంగుల ప్లాస్టిక్ సంచుల్లో అన్ని రకాల చెత్తని, వాడేసిన సానిటరీ టాయ్‌లెట్ టవల్స్‌ని కూడా క్రుక్కి తెచ్చి పడేస్తున్నారు. అవి కుళ్లి ఉబ్బి భరించలేని కంపు వస్తూ వుంటే, ఏనుగులు తొండం ఎత్తుకుని మరీ ఆఘ్రాణిస్తూ అంత భారమైన కాయాన్ని కదిలిస్తూ వచ్చి చెత్తని తినేస్తున్నాయి. పక్కనే పచ్చని పంట చేలు ఉన్నా- వాటికి నచ్చడంలేదు. ఏనుగుకి తినే పళ్లు వేరు మనకి చూపించే దంతాలు వేరు అన్నది సామెతయే గదా? అత్యంత దుర్ఘంధ విషతుల్యమైన పెంటను- ప్లాస్టిక్ సంచులతో సహా అవే తొండం ఇలా ఎత్తి అలా బాన పొట్టలలో పడేసుకుని సంతోషిస్తున్నాయి. అంతరించిపోతున్న జాతిగా ఈ ఏనుగులకు వేట రక్షణ వున్నది గాని- అవి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు సంచులు, క్రిమి సంహారక పదార్థాలు తినేసి జబ్బున పడి చస్తే? అడిగే దిక్కు లేదు. సిలిగురికి చెందిన సోమాదాసు అనే పెద్దమనిషి ఏనుగుల్ని ‘షూట్’ చెయ్యడానికి, కెమేరాతోనే లెండి.. వేటగాడిలాగా వెళ్లాడు కాని అడవిలోకి పోకముందే వూరు చివరనే మత్తశుండాల దండు ఒకటి పందులు బురదలో పొర్లుతున్నట్లు- సకుటుంబంగా, తోక తొండం రెండూ ఊపుకుంటూ లాగించేస్తున్నాయి. అక్కడ చెత్తలు పోయడం నేరం. కాని అక్కడ చెత్త ప్లాస్టిక్ సంచులు తొక్క తీయ్యని బత్తాయి పండ్లలాగా తినేయడం నేరం కాదుగా- కాని, రోజుకి ఆకులు అలములు, కొమ్మలు, రెమ్మలు పండ్లూ కూరగాయలు వగైరాలను కనీసం మూడుసాలుగు వందల పౌన్లు లాగిస్తే గాని, కడుపు నిండని గజరాజులు నల్లమందుకి అలవాటు పడ్డట్లు- ఈ కంపుకి దాని ఇంపుకి అలవాటుపడిపోయాయి. ఇప్పుడక్కడ పరమ చెత్తలను ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెచ్చి పడవెయ్యకపోతే, పెద్ద రైలు ఇంజనులను బోలిన ఈ మత్త్భేములు ఊరుమీద పడితే? భూమీద అవే అతిపెద్ద శాకాహార జంతువులూ కావున మనల్ని తినవులే అని ధీమగా వుంటే మట్టేస్తాయ్! కుమ్మి పచ్చడి చేసేస్తాయి! మనిషి భలేవాడు- లోగడ మైదా పిండి పేస్టు పూసి సినిమా వాల్‌పోస్టర్లు అనన్ని గోడలకి అంటించి కొన్నాళ్లు వెర్రిముండలు ఆవుల్ని ఆకర్షించి చంపేశాడు. ఇక జూకి వెళ్తే అక్కడ లేళ్లకి పాప్‌కార్న్, చిప్పు బ్యాగులతో నేరుగా మేపి వాటిని చంపేస్తారు జనాలు. ఏనుగులొస్తున్నాయ్ జాగ్రత్తని బోర్డులు పెట్టి అక్కడ చెత్తని పోయవలసిందేనా? ఇది సరే, అన్నట్లు పోయినేడాది మదుమలై అడవుల అంచున మూడు వేల ఎకరాల చెత్త గుట్టల్ని వేశారు పురజనులు. ఎంగిలికూడు, కుళ్ళిన పదార్థాలు, ప్లాస్టిక్ సంచులు అన్నీ తిన్న ఏనుగుల పిల్లలు ‘హరీ’మన్నాయి. అదో ప్రయివేట్ జాగా- ఆ యజమానిని బ్రతిమాలారు- సదరు ప్లాస్టిక్ చెత్తని వేరుచేయిస్తాము లెండి అన్నాడు ఆ మోతుబరి! ఏనుగా ఏనుగా ఎంత కరం కాలిందే నీకు!

ప్రియుడి ఉరి ప్రత్యక్ష ప్రసారం..?!
కలకత్తాలో ఒక పద్దెనిమిది ఏండ్లగల వయస్సున్న విద్యార్థిని మేఘా మల్లికని పోలీసులు అరెస్టు చేసి న్యాయివిచారణకు పెట్టారు. ఈ మేఘమల్లికకి మాజీ ఫ్రెండు సుజా మండల్ మొన్న అతని గదిలో ఆమె చూస్తుండగా ఆత్మహత్య చేసుకున్నాడు. కాకపోతే ఆమె వాళ్ళ ఇంట్లోనే వుంది. అదే ఆధునిక మొబైల్ ఫోన్లు వైఫైలు చేసే చిత్రం. కుర్రవాడు ‘లైవ్’లో తన మొబైల్ నుంచి ఈ అమ్మాయిని ‘ననే్న పెళ్లిచేసుకో’ అంటూ వెర్రిగా బ్రతిమాలాడు. ‘‘కుదరదు.. కుదరదు’’ అంటూ ఆమె విసుక్కుంది. వీడు నేను నీ కళ్ళముందే చూడు పైకి.. ‘‘ఆ త్రాడుతో ఉరి పోసుకు చస్తా’’నన్నాడు. ‘‘పోతేపో.. నాకేమిటిటా?’’ అమ్మాయి కవ్వింపు. ‘‘చూస్తావా?’’ వాడి ఛాలెంజి. ‘‘్భషుగ్గా చూస్తా.. నన్ను మరిచిపోరా బాబూ అంటే వినవేం?’’. ‘‘వాడు అవతల ఉరి పోసుకుని చూపించాడు. ఇవతల వాడి మాజీ ప్రేయసి టిక్కెట్టు లేకుండా సినిమా చూసేసింది’’. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. అదో మోడరన్ యాప్- లైవ్‌గా పరస్పరం ప్రేమించుకోడానికే అమ్మా నాన్న కొనిచ్చారా స్మార్ట్ఫోన్‌ను- హైస్కూల్ స్టూడెంట్లే ఆ ఇద్దరూ.. అయ్యో ప్రేమా? ప్రేమా? ఎంత పని చేశావ్?

-వీరాజీ