ఫోకస్

రికార్డు సమయంలో నిర్మాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతిలో ఇప్పుడున్నది తాత్కాలిక సెక్రటేరియట్ మాత్రమే. రికార్డు టైమ్‌లో ఈ సెక్రటేరియట్‌ను నిర్మించారు. ఉన్నంతలో ఇప్పుడున్న సెక్రటేరియట్ మెరుగ్గానే ఉంది. ఇప్పుడున్న తాత్కాలిక సెక్రటేరియట్‌లో ఇద్దరు మంత్రులకు ఒక సమావేశ మందిరం ఉంది. దీనివలన పెద్ద ఇబ్బందేమీ లేదు. తాత్కాలిక భవనంలో తొలుత కొన్ని ఇబ్బందులు రావడం సహజం. మంత్రులకు, ఉద్యోగులకు ఇప్పుడున్న సెక్రటేరియట్ చక్కగా సరిపోతోంది. హైదరాబాద్ నుంచి ఏపి పాలన సాగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక సెక్రటేరియట్‌ను నిర్మించారు. వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేందుకు హంగామా లేని డిజైన్లను ఎంపిక చేశారు. త్వరలోనే శాశ్వత సచివాలయం రాబోతోంది. దాన్ని అన్ని హంగులతో నిర్మించడానికి సిఎం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌లో కొత్తగా మార్పులు చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇందులో వినియోగిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్‌లు కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి.
-గంటా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి