ఫోకస్

అబ్బురపడేలా రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే కాకుండా ప్రపంచలోనే అందర్నీ అబ్బురపరిచే విధంగా అమరావతిలో నూతన రాజధాని నిర్మిస్తాం. ప్రపంచంలో సాంకేతిక విప్లవం శరవేగంతో పయనిస్తోంది. ఈ తరుణంలో ప్రపంచస్థాయి రాజధాని తరహాలో మేటి రాజధానుల సరసన అమరావతిని నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు. ఆయన శ్రమకు తగ్గట్టు చరిత్రలోనే నూతన రాష్ట్ర రాజధాని చిరస్థాయిగా నిలిచిపోతుంది. విభజన అనంతరం తెలుగు ప్రజలకు అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా తనకున్న సత్సంబంధాలు, మేథస్సుతో తాత్కాలిక రాజధానికి నిర్మాణం పూర్తి చేయడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం తెలిసిందే. వీటిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నూతన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను రెచ్చగొట్టి న్యాయస్థానం తలుపుతట్టేలా చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రాజధాని నిర్మించి తీరుతాం. నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ప్రజలు గుర్తించారు. అందుకే రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి 32 వేల ఎకరాల భూములిచ్చి బాబుకు బాసటగా నిలిచారు. దీనికి ప్రతిగా ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వారిని అన్ని విధాలా ఆదుకోవడానికి కట్టుబడి ఉంది. రాజధానికి రైతులు తమ జన్మభూమి రుణాన్ని తీర్చుకున్న తరహాలో ముఖ్యమంత్రి వారి రుణం తీర్చుకోవడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నారు. భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన రాజధానిలో అన్ని శాఖలు ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు రాజధాని రూపురేఖలు సిద్ధవౌతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నూతన రాజధాని నిర్మించడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదించే వీలుకలుగుతుంది. విభజన అనంతరం ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని అధిగమించి నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి సకాలంలో చేరుకోవడానికి రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.

- కొల్లు రవీంద్ర న్యాయ, నైపుణ్యాల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్