ఫోకస్

ప్రపంచ స్థాయి భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ శ్రేణి నగరంగా ఎపి రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దేందుకు అహరహరం శ్రమిస్తున్నారు. అందులో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఐకానిక్ భవనాలుగా నిలిపేందుకు వివిధ నమూనాలను పరిశీలించారు. అసెంబ్లీ భవనాన్ని కోహినూర్ వజ్రాకృతిలో ఉండేలా డిజైన్లను దాదాపు ఖరారు చేశారు. కోల్పోయిన వజ్రాన్ని ఈ రకంగా ప్రజల మదిలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. విజయాలకు సంకేతంగా భావించే విజయదశని రోజున అసెంబ్లీ, సచివాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. సంవత్సర కాలంలో భవనాన్ని పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా నిర్మిస్తున్నారు. భవనాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నాం. పరిపాలనా నగరానికి సమీపంలో సచివాలయం ఉండేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారులు, మంత్రులు తమకు అవసరమైన ఆఫీస్ స్పేస్ వివరాలు తీసుకుని, భవన డిజైన్‌లను ఆ మేరకు తీర్చిదిద్దుతున్నాం. వివిధ జిల్లాల సంస్కృతి, సంప్రదాయాలను కూడా ప్రతిబింబించేలా నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నాం. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో మంత్రులకు చాంబర్ల కేటాయింపు, అధికారులకు చాంబర్లు, విభాగాధిపతుల కార్యాలయాల కేటాయింపుల్లో ఏర్పడిన ఇబ్బందులు లేకుండా పక్కాగా ప్రణాళిక వేయడం జరుగుతోంది.

- కెఇ కృష్ణమూర్తి ఎపి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ)