ఫోకస్

సచివాలయం మార్పు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సచివాలయాన్ని సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో, జింఖానా మైదానానికి తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు. ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడమే. ప్రస్తుత రాష్ట్ర సచివాలయం విశాలమైన మైదానంలో ఉంది. ఇక్కడ ఆంధ్ర సచివాలయ భవనాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవచ్చు. అంతగా కావాలంటే ఇప్పుడున్న భవనాలను మరమ్మత్తు చేసుకుని ఆధునీకరించవచ్చు. వాస్తుదోషం, జాతకాల పేరిట ప్రభుత్వ భవనాలను తరలించడం తగదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దుబారాగా నిధులు ఖర్చుపెట్టడం వల్ల ధనిక రాష్ట్రం పేదల రాష్ట్రంగా మారుతోంది. ఇప్పుడున్న సచివాలయం నగర నడిబొడ్డున ఉంది. సందర్శకులు జిల్లాల నుంచి సమీపంలోని బస చేసి తమ పనులు చేసుకుని వెళ్లవచ్చు. పైగా 1956 నుంచి ఇక్కడ సచివాలయం ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులు ఇక్కడ పనిచేశారు. మహత్తరమైన చరిత్ర ఈ సచివాలయానికి ఉంది. అనేక పోరాటాలకు ఈ సచివాలయం నిలయం. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చిన కేంద్రం సచివాలయం. పైగా పక్కనే హుస్సేన్ సాగర్ ఉంది. పాలకులు స్ధిరచిత్తంతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. బైసన్‌పోలో, జింఖానా మైదానంలో క్రీడలు జరుగుతుంటాయి. రక్షణ శాఖ పరంగా అతి సున్నితమైన ప్రాంతం కంటోనె్మంట్. ఏ విధంగా చూసినా సచివాలయం తరలింపు వల్ల ప్రజలపై ఆర్థిక భారం మోపడమే అవుతుంది.

- కె శివకుమార్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వైకాపా శాఖ