ఫోకస్

రెఫరెండం నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సచివాలయం కోసం బైసన్ పోలోగ్రౌండ్స్‌లో కొత్తగా భవనాలను నిర్మించేందుకు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరించాలి. తొలుత రాజధాని నగరంలో నివసిస్తున్న ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు ‘రెఫరెండం’ నిర్వహించాలి. దీనివల్ల పారదర్శకత లభిస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలనే వినియోగించారు. ఎక్కడా ఇబ్బంది ఏర్పడ్డట్టు అటు ఉద్యోగుల నుండి కాని, ఇటు ప్రజల నుండి కాని ఫిర్యాదులు అందలేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతికి తరలిపోవడంతో ప్రస్తుతం ఉన్న భవనాలు తెలంగాణ సచివాలయం అవసరాలకు మించి ఉన్నాయి. విశాలమైన భవనాలను సంతోషంగా వినియోగించుకునేందుకు వీలుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సచివాలయ ప్రాంగణంలో తొమ్మిది బహుళ అంతస్థుల భవనాలు ఉన్నాయి. ఎపి సచివాలయం తరలిపోవడంతో ఈ భవనాలను సచివాలయంతో పాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ కార్యాలయాలు (కమిషనరేట్లు, డైరెక్టరేట్ల) కోసం వినియోగించుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు సచివాలయంతోపాటు రాష్టస్థ్రాయి ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్టు బైసన్‌పోలో గ్రౌండ్స్‌లో కొత్త సచివాలయాన్ని కట్టేందుకు వందలాది కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ నిధులను గ్రామాల్లోని పాఠశాలలకు వినియోగిస్తే విద్యార్థులకు వౌలిక సదుపాయాలైనా కలుగుతాయి. ఈ పరిస్థితిలో ఏ కోణంలో ఆలోచించినా సచివాలయకోసం కొత్త భవనాల అవసరం కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా, క్రికెట్ స్టేడియంకోసం బైసన్ పోలో గ్రౌండ్స్‌ను వినియోగించుకుంటామంటూ, ఈ గ్రౌండ్స్‌ను తమకు కేటాయించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. అప్పట్లో నేనే కోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం (పిల్) వేశాను. దాంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. బైసన్ పోలో గ్రౌండ్స్‌ను ఆర్మీకి శిక్షణకోసం వాడుతున్నారు. దేశంలో ఉన్న 64 కంటోనె్మంట్లలో హైదరాబాద్ (సికింద్రాబాద్) కంటోనె్మంటే పెద్దది. ఆర్మీకి సంబంధించి ఈ ప్రదేశం సురక్షితమైన ప్రాంతంగా చెప్పుకుంటున్నారు. ఆర్మీకి శిక్షణా కార్యక్రమాలను బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానం కలుగుతోంది. అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేముందు ఆర్మీ సూచనలను తీసుకోకపోవడం సరైన విధానం కాదు. తెలంగాణ ప్రభుత్వానికి బైసన్ పోలో గ్రౌండ్స్‌ను కేటాయించడానికి సంబంధించి రక్షణ మంత్రి తీసుకునే నిర్ణయం రాజకీయపరమైంది. అందువల్ల సైనికాధికారుల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పట్టణమైనా మధ్య భాగంలో అక్కడక్కడా ఓపెన్ స్పేస్ ఉండాలి. దానివల్ల వాతావరణ కాలుష్యం కొంత తగ్గుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఈ గ్రౌండ్స్‌ను విద్యార్థులు, యువత క్రికెట్ తదితర క్రీడలకోసం వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఓపెన్‌గా ఉన్న బైసన్ పోలో గ్రౌండ్‌ను కాంక్రీట్‌మయం చేయడం సముచితం కాదు.

- ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి పర్యావరణవేత్త.