ఫోకస్

అద్దెల బాధ తప్పుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. అత్యవసరంగా ఫైర్ ఇంజన్ వెళ్లడానికి కూడా వీలులేదు. కొత్త రాష్ట్రం ఆధునిక సౌకర్యాలతో కొత్త సచివాలయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నాయకులకు ఎందుకో నచ్చడం లేదు. ప్రస్తుతం 119 శాఖాధిపతుల ఆఫీసులు, 89 ఇతర కార్యాలయాలో అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి చెల్లించే పదేళ్ల అద్దెతో కొత్త సచివాలయాన్ని నిర్మించవచ్చు. ఇప్పుడున్న సచివాలయంలో నిజాం కాలంలో నిర్మించిన భవనాలు, 50 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు కూడా ఉన్నాయి. చాలా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటి స్థానంలో ఈ కాలానికి ఉపయోగపడేట్టుగా కొత్త సచివాలయ భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సికిందరాబాద్‌లోని బైసన్ గ్రౌండ్‌లో రక్షణ శాఖకు చెందిన 38 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ప్రతిసారి రక్షణ శాఖ అనుమతి తీసుకోవలసి వచ్చేది. అలాంటిది కేంద్ర మంత్రితో చర్చించి, చాకచక్యంగా ఆ భూమిని రాష్ట్ర సచివాలయం కోసం సాధించడంలో ముఖ్యమంత్రి సపలీకృతులు అయ్యారు. దీనికి అభినందించాల్సింది పోయి అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఏటా 30 కోట్ల రూపాయలు అద్దె భవనాలకు చెల్లించే బదులు రెండుమూడు వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయ భవనం నిర్మించవచ్చు. ప్రస్తుతం పది ఎకరాల భూమిలోనే తెలంగాణ సచివాలయం ఉంది. నగరంలో అనేక ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కార్యాలయాలు ఉన్నాయి. దీనికి బదులు 38 ఎకరాల్లో అద్భుతమైన నూతన సచివాలయ భవనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా రానుంది. అన్ని ప్రాంతాలకు బైసన్ గ్రౌండ్ అందుబాటులో ఉంటుంది. జాతీయ రహదారులకు పక్కనే ఉంది. మెట్రో రైల్ పక్కన రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా రావడానికి అనువైన ప్రాంతం ఇది. హైదరాబాద్ నలువైపులా పటాన్‌చెరు, ఎల్‌బి నగర్, పహాడీ షరీఫ్, మేడ్చల్, ఉప్పల్ , అల్వాల్ రోడ్ల గుండా నేరుగా ఇక్కడికి వచ్చే సౌకర్యం ఉంది. కొత్త భవనాలు నిర్మించడమే తప్పు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కోట్లాది రూపాయల కుంభకోణాలతో కాలం గడిపిన కాంగ్రెస్ నాయకులు ప్రజల సౌకర్యంకోసం నూతన భవన నిర్మాణాన్ని సహించే స్థితిలో లేరు. దీనికి ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పిస్తారు.

- కర్నె ప్రభాకర్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ