ఫోకస్

తరలింపును అడ్డుకుంటాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైసన్ పోలో గ్రౌండ్‌కు సచివాలయాన్ని తరలించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. తరలింపును కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలతో కలిసి అడ్డుకుంటుంది. వాస్తు బాగా లేదన్న వంకతో సచివాలయాన్ని తరలించాలన్న ఆలోచన మంచిది కాదు. వాస్తు బాగా ఉన్నందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అసలు ఆరు నెలలకు ఒకసారి సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి వాస్తుతో పని ఏముంది. ప్రస్తుతం ఉన్న సచివాలయమే తెలంగాణలోని అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంది. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ఎక్కడి నుంచైనా వచ్చేందుకు వీలుంది, చుట్టుపక్కల వసతి సౌకర్యాలూ ఉన్నాయి. పైగా సచివాలయం చుట్టూర రోడ్లు ఉన్నాయి. ఏ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయినా మరో రోడ్డు నుంచి ప్రయాణికులు సునాయసంగా వెళ్ళాల్సిన గమ్యాలకు చేరిపోగలరు. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అవి అప్పగించిన తర్వాత ఇంకా బోలెడంత వసతి సౌకర్యం ఉంటుంది. ఒకవేళ ఏవైనా భవనాలు బాగా లేవని భావిస్తే, వాటిని కూల్చివేసి, ఇంకా ఆధునికంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నఫళంగా సికింద్రాబాద్‌లోని బైసన్ గ్రౌండ్‌కు మార్చాల్సిన అవసరమే లేదు. బైసన్ గ్రౌండ్‌ను కేంద్ర రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినందుకు సంతోషమే. కానీ ఆ స్థలంలో సచివాలయం నిర్మించాలన్న ప్రతిపాదన విరమించుకుని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలి. తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుంది. షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టించి గుర్తింపు పొందినట్లు తానూ సచివాలయాన్ని నిర్మించి చరిత్రలో గుర్తింపు తెచ్చుకోవాలన్నదే ముఖ్యమంత్రి తాపత్రయంలా కనిపిస్తున్నది. కానీ తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని గమనించాలి. ముఖ్యమంత్రి 1,600 కోట్ల రూపాయల వ్యయంతో బైసన్ పోలోలో నూతన సచివాలయాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రుణ మాఫీ జరగక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ లేక మధ్యలోనే విద్యను నిలిపి వేస్తుంటే ముఖ్యమంత్రి ఇటువంటి ఆలోచన చేయడం సమంజసం కాదు.
ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలను మేము చూస్తూ ఊరుకోం. తప్పకుండా అడ్డుకుంటాం. ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తాం. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయంపై ఈ నెల 20న ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాను. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, చార్మినార్, మదీనా, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు బాక్స్‌లు పెడతాను. ఆ తర్వాత వాటిని మీడియా సమక్షంలో తీసి ప్రభుత్వానికి తెలియజేస్తాను.