బిజినెస్

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో కార్తి చిదంబరానికి సిబిఐ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ అవినీతి కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారం మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి సమన్లు జారీ చేసింది. 2006లో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు అనుమతి ఇవ్వడానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కేసు నమోదయింది. ఎయిర్‌సెల్‌లో 80 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టడానికి మ్యాక్సిస్ అనుబంధ సంస్థ అయిన మారిషస్‌లోని గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనుమతి కోరింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉండగా, అప్పటి ఆర్థిక మంత్రి అనుమతి ఇచ్చారు. అప్పటి ఆర్థిక మంత్రి ఎఫ్‌ఐపిబి అనుమతులు మంజూరు చేయడానికి దారితీసిన పరిస్థితులపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు 2014లో ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో సిబిఐ పేర్కొంది. 600 కోట్ల రూపాయలకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చే అధికారం ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి మాత్రమే ఉండగా, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం అనుమతులు ఇచ్చారని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. అయితే మామూలు పద్ధతిలోనే ఎఫ్‌ఐపిబి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని చిదంబరం ఈ ఏడాది విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ 2014లో చిదంబరంను కూడా విచారించింది.