క్రీడాభూమి

రిషభ్‌కు రెండు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్కాదువా, సెప్టెంబర్ 13: శ్రీలంకలోని వస్కాదువాలో జరిగిన పశ్చిమాసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ముంబయికి చెందిన రిషభ్ షా రెండు కాంస్య పతకాలు సాధించాడు. దక్షిణ ముంబయి చెస్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న రిషభ్ అండర్-14 ర్యాపిడ్, బ్లిజ్ విభాగాల్లో తృతీయ స్థానాల్లో నిలిచాడు. ర్యాపిడ్ చెస్‌లో శ్రీలంక గ్రాండ్ మాస్టర్ అభ్యర్థి హెచ్. తిలకరత్న స్వర్ణ పతకం సాధించగా, మహమ్మద్ ఫహాద్ రహ్మాన్‌కు రజతం లభించింది. బ్లిజ్ విభాగంలో మహమ్మద్ ఫహాద్ రహ్మాన్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. తిలకరత్న ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు.