అంతర్జాతీయం

వెల్లివిరిసిన సుహృద్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, సెప్టెంబర్ 13: భారత్-జపాన్ మధ్య వెల్లివిరిసిన స్నేహ బంధానికి అహ్మదాబాద్ వీధులు బుధవారం ప్రతీకగా నిలిచాయి. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 8 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించి ఈ స్నేహానికి సరికొత్త సౌరభాన్ని అందించారు. ఈ ఎనిమిది కిలోమీటర్లమేర అహ్మదాబాద్ ప్రజలు నృత్యాలు, పాటలతో ఇరుదేశాల ప్రధానులకు ఆనందోత్సహాలతో స్వాగతం పలికారు. ఓ దేశ ప్రధానితో మోదీ రోడ్‌షో నిర్వహించడం అన్నది ఇదే మొదటి సారి. ఇంతకుముందు అహ్మదాబాద్ విమానాశ్రయంలో సతీసమేతంగా దిగిన షింజోఅబేకు ఘనస్వాగతం లభించింది. ఇప్పటివరకూ అనేక సమావేశాల్లో పాల్గొన్న చనువు, పరస్పర అవగాహన ఈ రోడ్‌షోలో ఇరువురు ప్రధానుల మధ్య కనిపించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు సారధ్యం వహిస్తున్న మోదీ, షింజో ఈ రకంగా కలిసికట్టుగా పయనించి సరికొత్త భావ సారుప్యతకు అద్దం పట్టారు. కుర్తా, పైజామాతో షింజో ఈ రోడ్‌షోలో పాల్గొనడం భారతీయ సంప్రదాయానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పట్టింది. విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకూ వీరిద్దరూ కలిసి వెళ్లారు. ఈ రోడ్‌షోలో జపాన్ ప్రధాని భార్య అకి ఫొటోలు కూడా తీసుకోవడం జనంలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. రహదారికి ఇరువైపులా భారత్-జపాన్ జాతీయ పతాకాలతో ప్రజలు స్వాగతం పలికారు. భారత సాంస్కృతికకు అద్దం పట్టేలా 28 వేదికలను ఏర్పాటు చేసి పలు రాష్ట్రాల ప్రత్యేకతలను చాటుతూ ప్రదర్శనలు జరిగాయి. జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సర్వత్రా అందరినీ ఆకర్షించాయి. సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి ఇరువురు దేశాధినేతలు ఘన నివాళులు అర్పించారు. అక్కడున్న విజిటర్స్ రిజిస్టర్‌లో ప్రేమ.. కృతజ్ఞత అంటూ జపాన్ భాషలో షింజో తన భావాన్ని రాశారు. అనంతరం షింజో దంపతులతో కలసి సబర్మతి ఒడ్డున కాసేపు మోదీ ముచ్చటించారు. చతురోక్తులతోనూ, నవ్వులతోనూ ఇరువురూ ఉల్లాసంగా గడిపారు. గురువారం నుంచి షింజో అధికారి కార్యక్రమాలు మొదలవుతాయి. అహ్మదాబాద్, ముంబయి మధ్య హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కేవలం రెండు గంటల్లో 500 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేరీతిలో ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. గాంధీనగర్‌లోని 12వ భారత- జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. అనంతరం పలు ఒప్పందాలను కుదుర్చుకుంటారు.