జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లు పెటాకులుగా మారుతుండడం, కట్నంకోసం వేధింపులులాంటి సంఘటనలు పెరిగిపోతుండడంతో వీటిని అరికట్టడానికి భారత్‌లో ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన నిపుణుల కమిటీ విదేశాంగ శాఖకు సిఫార్సు చేసింది.
భారత్‌లోని యువతులను పెళ్లి చేసుకునే ప్రవాస భారతీయులు వారిని వదిలేయడం లేదా గృహ హింసలకు, వరకట్నం వేధింపులకు గురికావడం పెరిగిపోతుండడంతో భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉన్న ఎన్‌ఆర్‌ఐలు దేశంలో పెళ్లిళ్లు చేసుకోవడంపై ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు, భారత సంతతికి చెందిన విదేశీయులు ఆధార్‌కోసం నమోదు చేసుకోవడానికి సంబంధించి ఒక విధానాన్ని రూపొందించే పనిలో ఆధార్‌కు సంబంధించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ప్రస్తుతం భారతీయులు, చెల్లుబాటయ్యే భారతీయ వీసాలు కలిగి ఉన్నవారు అందరూ ఆధార్ సంఖ్యకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, విదేశాల్లో ఉండే నేరస్థులను భారత్‌కు అప్పగించాలని కోరేందుకు ఉపయోగపడే ఒప్పందాలను కూడా సవరించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. గృహ హింసకు పాల్పడే నిందితుడ్ని కూడా అప్పగించడానికి వీలుగా ఈ ఒప్పందాలను సవరించాలని ఆ కమిటీ సూచించింది. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లలో నేరానికి పాల్పడిన వ్యక్తి జాడను తెలుసుకోవడం క్లిష్టంగా ఉంటోందని మహిళా, శిశు సంక్షేమ శాఖలోని అధికారి ఒకరు చెప్పారు. ప్రధానంగా నోటీసు ఇవ్వడం అనేది సమస్యగా ఉంటోందని, ఎందుకంటే వారికి సంబంధించిన అడ్రసు ఉండదని ఆయన అన్నారు. ఈ నివేదిక కేవలం ఎన్‌ఆర్‌ఐలకు సంబందించినది మాత్రమేనని, విదేశాల్లో నివసించే భారతీయ సంతతికి చెందిన ఎవరికీ సంబంధించినది కాదని కూడా ఆ అధికారి తెలిపారు.