జాతీయ వార్తలు

‘సిట్’ దర్యాప్తులో జోక్యం చేసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 13: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు బహిర్గతం చేయలేమని కర్నాటక హోమ్ మంత్రి రామలింగారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 5 రాత్రి వేళ లంకేశ్‌ను ఆమె ఇంటివద్దే దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేశ్ హత్యపై దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు ఏమి తేలుస్తుందో నివేదిక వచ్చేవరకూ ఆగుదాం. అన్ని కోణాల్లోనూ విచారణ సాగుతోంది అని వ్యాఖ్యానించారు. సిట్ దర్యాప్తు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని రామలింగారెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటిలిజెన్స్ ఐజిపి బికె సింగ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించాయని ఆదివారం హోమ్ మంత్రి ప్రకటించారు. గౌరీ హంతకుల ఆచూకీ తెలిపితే 10 లక్షల బహుమతి అందజేస్తామని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే గౌరీ హత్యకు సంబంధించి మీడియాలో వివిధ కథనాలు వెలువడ్డాయి. కర్నాటక సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యకేసులో రాష్ట్ర వ్యాప్తంగా 80 మందిని విచారించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. దీన్ని దర్యాప్తు అధికారి ఎంఎన్ అనుచేత్ ఖండించారు. మీడియాలో వచ్చేవన్నీ అవాస్తవాలని, దర్యాప్తులో ఏమైనా పురోగతి ఉంటే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.