జాతీయ వార్తలు

నెగ్గిన నేరడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: వంశధార నదిపై ఆంధ్ర రాష్ట్రం నేరడి బ్యారేజీ నిర్మించుకోవచ్చని వంశధార ట్రిబ్యునల్ బుధవారం తుది తీర్పునిచ్చింది. నేరడి బ్యారేజీ నిర్మాణ అంశంపై ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య గత 55 ఏళ్లుగా నెలకొన్న వివాదానికి దీంతో తెరపడింది. నేరడి బ్యారేజీని ఆంధ్ర నిర్మించుకోవచ్చంటూ న్యాయమూర్తి ముకుంద శర్మ నేతృత్వంలోని వంశధార ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. నేరడి బ్యారేజీ నిర్మాణంలో ఉన్న సమయంలో వంశధార జలాలు ఉపయోగించుకునేందుకు ఆంధ్ర ప్రభుత్వం కాట్రగడ వద్ద సైడ్‌వీర్‌తోపాటు ఆన్సిలరీ నిర్మాణాలను చేపట్టవచ్చని కూడా ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. అయితే బ్యారేజీ నిర్మాణం పూరె్తైన వెంటనే సైడ్‌వీర్‌ను మూసేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యారేజీ, సైడ్ వీర్ నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఏపీ ప్రభుత్వం సైడ్‌వీర్ ద్వారా జూన్ 1నుంచి నవంబర్ 30వరకు 8టిఎంసి జలాలు ఉపయోగించుకోవచ్చని ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. సైడ్‌వీర్ వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్ గేట్లను డిసెంబర్ 1న మూసివేసి, మే 31వరకు తెరవకూడదని ట్రిబ్యునల్ ఆదేశించింది. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం ఒడిశాలో 106 ఎకరాల భూమి ఒకే ఏడాదిలో అక్కడి ప్రభుత్వం సేకరించి ఏపీకి అందించాల్సి ఉంటుంది. భూసేకరణ ఖర్చును ఏపీ భరించాలి. ట్రిబ్యునల్ తీర్పు అమలుకు నలుగురు సభ్యులతో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో కేంద్ర జల సంఘానికి చెందిన ఇద్దరు, ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు చెందిన ఒక్కో సభ్యుడు ఉంటారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మించి 115 టిఎంసి జలాలు సమంగా పంచుకోవాలని 1962లో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఏపీ ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతంపై ఒడిశా ప్రభుత్వం అప్పట్లో అభ్యంతరం తెలిపింది. దీంతోపాటు తమ రాష్ట్రంలో ఏర్పడే ముంపు ప్రాంతంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేరడి బ్యారేజీ నిర్మాణంలో జప్యం జరుగుతున్నందున వంశధార జలాలను ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సైడ్ వీర్ నిర్మాణాన్నీ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయటం తెలిసిందే. సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాల వాదనలు విన్నతరువాత సమస్యను పరిష్కరించేందుకు వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ 2013లో తాత్కాలిక తీర్పు ఇవ్వగా, బుధవారం తుది తీర్పు వెల్లడించింది. నేరడి బ్యారేజీ కుడి హెడ్ స్లూయిస్ సామర్థ్యం 8000 క్యూసెక్కులుగా ఉండాలి. ఒడిశా అవసరాల కోసం బ్యారేజీకి ఎడమగట్టు హెడ్ స్లూయిస్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఎడమగట్టు హెడ్ స్లూయిస్ సామర్థ్యం ఎంత ఉండాలనేది ఒడిశా ప్రభుత్వం ఆరు నెలల్లోగా ఏపీ ప్రభుత్వానికి సూచించాల్సి ఉంటుంది. నేరడి బ్యారేజీ ఎడమగట్టు హెడ్ స్లూయిస్ నిర్మాణం ఖర్చును ఒడిశా ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఓడిశా ప్రభుత్వం భవిష్యత్‌లో ఆయకట్టు అభివృద్ది చేసుకోవాలనుకుంటే, నేరడి బ్యారేజ్ నిర్మాణం ఖర్చును ఆయకుట్టు ఆధారంగా రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ తుది తీర్పులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి పంట కోసం జూన్ 1 నుండి నవంబర్ 30 మధ్య నేరడి బ్యారేజీ నుంచి నీటిని తీసుకోవచ్చని ట్రిబ్యునల్ తమ తీర్పులో పేర్కొంది. నేరడి బ్యారేజీ, సైడ్ వీర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులనూ కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, పర్యవరణ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నేరడి బ్యారేజీ నిర్మాణం పూరె్తైతే ఏపీలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది.