రాష్ట్రీయం

అమ్మలాంటిది నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: నదులను కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుందని సిఎం చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాట్లాడారు. నదులను కాపాడుకుంటూ, భవిష్యత్తు తరాలకు నీటిని అందించే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్‌ను అభినందించారు. ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమం నదుల పునర్జీవానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. నదితోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, అలాంటి నదిని పూజించడం మన సంస్కృతి, వారసత్వంలో భాగమన్నారు. నదులతో ప్రజలు మమేకం కావడానికి దేశంలో నదులకు పనె్నండేళ్లకో సారి పుష్కరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ నీటికోసం గత కొనే్నళ్లుగా కృషి చేస్తున్న మొదటి వ్యక్తి కాగా, రెండో వ్యక్తి జగ్గీ వాసుదేవ్ అన్నారు. వాసుదేవ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ ఫర్ రివర్స్‌ని 16 రాష్ట్రాల్లో చేపట్టడం అభినందనీయమన్నారు. పర్యావరణ సమతుల్యానికి నదులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆంధ్రలో గోదావరి -కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో చరిత్ర సృష్టించామని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో 25 నదులు, మధ్య కోస్తాలో 18 నదులు, దక్షిణ కోస్తాలో 12 నదులు, రాయలసీమలో 19 నదులు ప్రవహిస్తున్నాయన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నదుల పునరుజ్జీవానికి ఈషా ఫౌండేషన్ రూపొందించే విధాన పత్రాన్ని ఆమోదించి అమలు చేసే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా చేస్తామన్నారు.
నదులు ఎండిపోవడానికి మనమే కారణం
ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ నదులు ఎండిపోవటానికి మనమే కారణమన్నారు. ర్యాలీ ఫర్ రివర్స్‌లో భాగంగా నాలుగు రాష్ట్రాలలో పర్యటించానని, ఆంధ్రలో ఉన్నంత పచ్చని ప్రాంతాలను ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రాన్ని హరితహారంగా మారుస్తున్న సిఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నదుల రక్షణకు హామీలు సరిపోవని, సమగ్ర విధానం, చట్టం కావాలని, నదులు జాతి సంపదని చెప్పారు. ర్యాలీ ఫర్ రివర్స్ ద్వారా వచ్చిన అభిప్రాయాలను సమగ్రంగా కేంద్రానికి సమర్పిస్తామన్నారు. నదుల పునరుజ్జీవనానికి ఇప్పుడు ప్రయత్నిస్తే 25 ఏళ్ల తర్వాత ఫలితాలు వస్తాయన్నారు. నదుల కోసం పనిచేయడం ఇప్పుడే ప్రారంభిద్దామన్నారు. భవిష్యత్తు తరాలకు నిత్యం ప్రవహించే నదులను బహుమతిగా అందజేద్దామన్నారు.
ఇంకా సమయం ఉంది: రాజేంద్రసింగ్
వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ మాట్లాడుతూ నదులు ఎండిపోవడానికి మనమే కారణమని, వాటిని రక్షించుకునేందుకు మనకు ఇంకా కొంత సమయం ఉందని తెలిపారు. తక్షణమే మేల్కొని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భూగర్భజలాలను విపరీతంగా వాడేస్తున్నారని, నదీ జలాలు దుర్వినియోగం చేస్తున్నారని, వాటి ప్రవాహాలను ఛిద్రం చేస్తున్నారన్నారు. జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ముందుగా సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ నదుల పరిస్థితిపై ప్రదర్శన ఇవ్వగా, ప్రముఖ గాయని స్మిత నదులపై తాను రూపొందించిన పాటను ఆలపించారు. చిన్నారులు అప్రా, దీపికలు నదుల ఆవశ్యకతపై ఇచ్చిన వ్యాఖ్యానం పలువురిని ఆకటుకుంది. ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.
చిత్రం.. నదులు కాపాడతామని ప్రతిజ్ఞ చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, జగ్గీ వాసుదేవ్, తదితరులు