రాష్ట్రీయం

రైతాంగంపై అంత అక్కసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రైతులకు ఉచిత పెట్టుబడి సమకూర్చడానికి భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుడితే విపక్షాలు రైతుల నోట్లో మట్టికొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతును రాజుగా మార్చాలన్న కెసిఆర్ సంకల్పాన్ని విపక్షాలు అడ్డుకోలేవన్నారు. తెరాస సిఎల్పీలో బుధవారం ఎమ్మెల్సీలు రాములు నాయక్, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పెద్దపల్లి ఎంపి బాల్కా సుమన్ మీడియాతో మాటాడారు. ప్రజలకు మేలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తే వాటికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టుకెక్కాయన్నారు. రైతులకు సబ్సిడీ ఇస్తామంటే మీకేందుకు అభ్యంతరమని హైకోర్టు ప్రతిప్రక్షాలను తప్పుపట్టిందని సుమన్ గుర్తు చేశారు. ప్రభుత్వ పనులను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా ఇలాగే కోర్టులకు ఎక్కుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులైన రైతులతో సమన్వయ సమితిలు ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు దానికి కూడా అడ్డుపడుతున్నాయన్నారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడకుండా సిఎం కెసిఆర్ ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు.