తెలంగాణ

సింగరేణి ఎన్నికల్లో కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సింగరేణి కార్మికులు రానున్న ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘాన్ని మట్టికరిపించి బుద్ది చెప్పాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి డి. శ్రీ్ధర్ బాబు, గండ్ర వెంకట్రామ్ రెడ్డి, ఐఎన్‌టియుసి నాయకులు ప్రసాద్, బిఎన్ రెడ్డి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకొని కార్మిక సంఘానికి జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపొందిందనిని అన్నారు.
ఓపెన్ కాస్ట్ గనులను మూయించి గ్రౌండ్ మైన్స్‌ను తెరుస్తామన్న హామీ ఎమైందని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఎన్నో హామీలు గుప్పించిన కెసిఆర్ ఒక్క హామిని కూడా నిలబెట్టుకోలేక పోయారని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాలను ఇప్పిస్తామని, ఆదాయ పన్ను మినహాయింపు, 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కార్మికులకు ఇళ్లు నిర్మిస్తామని మూడేళ్లు గడిచినా ఎందుకు చేయలేదని నిలదీశారు. నవరత్న సంస్థల్లో ఒకటైన సింగరేణి సంస్థను అభివృద్ధి పరచకుండా గనులను ప్రైవేట్‌పరం చేయడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కెసిఆర్ జివో తీసుకుని వస్తే ఆయన కుమార్తె జాగృతి సంస్థకు చెందిన సతీష్‌చే కేసు వేయించారని దుయ్యబట్టారు.
కెసిఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ సింగరేణి ఎన్నికలే నాంది కానున్నాయని, ఈ వేదిక నుంచే వ్యతిరేక శక్తులను ఐక్యం చేసి ముందుకు సాగుదామని రేవంత్‌రెడ్డి కోరారు. కెసిఆర్ పాలనకు రెఫరెండంగా జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. కార్మికులందరూ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి హక్కులను రక్షించుకునేలా చైతన్య పరుస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22న భూపాల్‌పల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చాడా వెంకటరెడ్డి తెలిపారు.