ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నమైన నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని అడ్డుకుంటున్న తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలు చరిత్రలో ద్రోహులుగా నిలిచిపోతారని మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు లేఖల పేరుతో లోటస్‌పాండ్ కేంద్రంగా ప్రజా రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వంద మంది జగన్‌లు వచ్చినా అనుకున్న సమయానికే రాజధానిని నిర్మించి తీరతామని బుధవారం ఒక ప్రకటనలో మంత్రి స్పష్టం చేశారు. స్విస్ ఛాలెంజ్‌పై కేసులు, భూసేకరణపై కేసులు, పరిహారం చెల్లిస్తుంటే కేసులు... ఇలా వందల కేసులు వేశారన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి అన్ని అవరోధాలను దాటుకుని ముందుకు వెళ్తున్నారన్నారు. అమరావతి నిర్మాణాన్ని పదే పదే అడ్డుకుంటున్న ప్రతిపక్షం వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. రాజధానిని అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు రైతుల పేరుతో లేఖలు రాయడం, బ్యాంకును తప్పుదారి పట్టించడం, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. గతంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటనపై విద్వేషం వెళ్లగక్కిన విధంగానే ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాజధాని నిర్మాణాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.