హైదరాబాద్

సోషల్ మీడియాతో యువత పెడదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: వాట్సాప్‌లు, ఫేస్‌బుక్, ట్విటర్‌లాంటి సోషల్ మీడియాల ప్రభావం యువతపైన విపరీతంగా పడుతోంది. కుటుంబాన్ని సైతం మర్చిపోయేలా చేస్తున్నాయి. తాజాగా కళాశాలల్లో యునైటెడ్ నేషన్ పేరుతో విద్యార్థులు గ్రూప్‌గా ఏర్పడి వయస్సుకు మించిన పనులు చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడి కావడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మియాపూర్ పోలీసు స్టేషన్‌లో పరిధిలో నివాసముండే చాందీని జైన్ కిడ్నాప్‌కు గురై.. అనంతరం హత్యకు గురైన కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కేసులో నిందితుడైన యువకుడు యునైటెడ్ నేషన్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. వందకుపైగా సభ్యులు వీరు ఏర్పాటు చేసిన గ్రూపులో ఉన్నారు. వాస్తవానికి గ్రూపు సభ్యులంతా చదువుకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడం అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే, చదువు పోయి పార్టీలు, పబ్‌ల సమాచారం ఇచ్చుకునే విధంగా గ్రూపు మారిపోయింది. చాందీని హత్య కేసులో నిందితుడైన యువకుడు మృతురాలుతో పాటు మరో 50మంది మూడు రోజుల పాటు నగరంలో హోటల్ బుక్ చేసుకుని పార్టీ చేసుకున్నారు. యునైటెడ్ నేషన్ సమావేశం పేరుతో హోటల్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. సాయంత్రం పబ్‌లో అంతా కలిసి మద్యం సేవించారు అనంతరం బుక్ చేసుకున్న రూంలో స్టే చేశారు. ఇందుకు ఒక్కొక్కరి నుండి 3వేల రూపాయలు హోటల్ యజమాన్యం వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో కూడా యునైటెడ్ నేషన్ గ్రూప్ సమావేశం పేరుతో బెంగళూరులో గడిపి వచ్చినట్లు తెలిసింది. పార్టీలు, పబ్‌ల్లో మృతురాలు మరో యువకుడితో చనువుగా ఉండడం నిందితుడు భరించలేక హత్యకు పథకం వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫేస్ బుక్‌లో తన మిత్రుడికి ఎక్కువ తనకు తక్కువ లైక్‌లు వచ్చాయని కోపాలు పెంచుకోనే దాకా రోజులు వచ్చాయని సైబరాబాద్ సిపి వివరించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఒకంట కనిపెట్టాలని, వారంలో ఒక్క రోజైన పిల్లలతో ఆప్యాయంగా గడిపితే ఇలాంటి సంఘటలను జరగవని సూచించారు. నగరంవొ జరిగిన ఓ పార్టీకి యువకుడు లక్ష 80 వేల రూపాయలు బిల్లు చెల్లించాడంటే తల్లిదండ్రులు ఆ యుకుడికి ఎంత స్వచ్ఛనిచ్చారని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా యూనైటెడ్ నేషన్ విద్యార్థుల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చదువు కోసం చర్చించుకుంటే పర్వాలేదని అది వెర్రితలలు వేస్తేనే సమస్యలు తలెత్తుతాయని సిపి తెలిపారు. హత్యకు బలమైన కారణం సదరు యువకుడు మృతురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని పార్టీ సమయంలో దిగిన ఫొటోలేనని పోలీసు అధికారులు చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛను ఇవ్వకుండా ఓ కంట కనిపెట్టుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవని పోలీసు అధికారులు అంటున్నారు.