హైదరాబాద్

సింగిల్ విండోలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: జలమండలి నూతనంగా నల్లా కనెక్షన్‌ను మంజూరు చేసేందుకు వినియోగించే సింగిల్ విండో విభాగం పనితీరులో పారదర్శకతను పెంపొందించేందుకు పలు మార్పులు చేయనున్నట్లు జలమండలి ఎండి దాన కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండో సెల్ గ్రీన్ బ్రిగేడ్‌లు కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఐటి విభాగాన్ని ఆదేశించారు. నూతన నల్లా కనెక్షన్‌కు సంబంధించి అన్ని విషయాలు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు తెలుసుకునే విధంగా ఓ యాప్‌ను రూపొందించాలని సూచించారు. ఈ యాప్ నూతన కనెక్షన్‌కు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా, త్వరితగతిన మంజూరు ఇచ్చేలా అధికారులకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సింగిల్ విండోలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లు సమర్థవంతమైన సేవల కోసం విజిలెన్స్ విభాగంలోకి మార్చాలని ఆదేశించారు. నూతన యాప్ వల్ల కొత్త నల్లా కనెక్షన్లకు సంబంధించి చెల్లింపుల కోసం ఐదు రోజుల్లో మంజూరు వస్తుందని తెలిపారు. నిర్ణీత రుసుం చెల్లించే వినియోగదారులకు కొత్త కనెక్షన్లను చాలా వేగంగా, త్వరితగతిన అందించేందుకు జలమండలి సిద్దంగా ఉందని ఎండి స్పష్టం చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే నూతన కనెక్షన్లలో రోడ్డు కట్టింగ్ పనులను జలమండలే చూసుకుంటుదన్నారు. అలాగే పారిశుద్ద్య, కలుషిత నీటి సమస్యలు తరుచూగా ఉత్పన్నమయ్యే ప్రాంతాలపై ఆయన సమీక్షిస్తూ గత ఏడాది కాలం నుంచి తరుచుగా ఈ సమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించి, దానికి కారణాలను విశే్లషించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మురికినీరు రోడ్డుపై ఉప్పొంగడానికి సిల్ట్ చాంబర్లు లేకపోవటమే ప్రధాన కారణమని గ్రహించినట్లు తెలిపారు. దాదాపు 4500 నుంచి 5వేల వరకు హోటళ్లు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలు సిల్ట్ చాంబర్లు నిర్మించినట్లు అధికారులకు ఎండికి వివరించారు. నోటీసులు అందిన తర్వాత కూడా సిల్ట్ చాంబర్లు నిర్మించుకోని యాజమాన్యాలను గుర్తించి, వారు మూడు నెలల్లో చాంబర్లను నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని ఆపరేషన్, మెయింటనెన్స్ అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో జలమండలే చాంబర్లను నిర్మించి, అందుకయ్యే ఖర్చును యజమానుల నుంచి వసూలు చేయాలన్నారు. డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు త్వరలోనే రొబోటిక్ యంత్రాలను వినియోగించేందుకు వీలుగా జలమండలి ప్రణాళికలను సిద్దం చేసిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన డెమో నిర్వహిస్తామని ఎండి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ ఆజ్మీరాకృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ బి. విజయ్‌కుమార్, పి అండ్ ఏ విభాగం డైరెక్టర్ ఎ.ప్రభాకర్, సిజిఎంలు బి. ప్రవీణ్‌కుమార్, పి.రవి, వెంకటేశ్వరరావుతో పాటు జిఎంలు, డిజిఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.