తెలంగాణ

తెరాస పాలనకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి-గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుత విజయం సాధించిందని, తమ ప్రభుత్వ పనితీరుకు దక్కిన గుర్తింపు ఇదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజేందర్ మాట్లాడారు. తెరాస పాలనకు ఆ ఫలితాలు రెఫరెండంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రాల అభివృద్ధే తమ ధ్యేయమని ప్రధాని మోదీ ప్రకటిస్తున్నారని, కానీ నిధుల కేటాయింపుల్లో ఆ చిత్తశుద్ధి కన్పించడం లేదని ఈటల ఆరోపించారు. వివిధ పథకాల కింద తెలంగాణకు కేటాయించాల్సిన నిధుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జైట్లీ దృష్టికి తీసుకువచ్చారు.