Others

శిలాజ ఇంధన ఉద్గారాలతోనే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూతాపం పెరగడానికి, అందువల్ల మంచు ప్రాంతాలు కరిగి సముద్రమట్టం పెరగడానికి వాతావరణంలోకి వెలువడుతున్న శిలాజ ఇంధన వాడకం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలే కారణమని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో 90 కర్బన ఉత్పత్తి సంస్థలే ఇందుకు కారణమని స్పష్టమైంది. 1880 తరువాత భూ ఉపరితలపు ఉష్ణోగ్రతల పెరుగుదలలో సగానికి సగం వీటివల్లేనని, సముద్రజల మట్టం పెరుగుదలలో 30శాతం మేరకు ఆయా సంస్థలు విడుదల చేసిన కర్బన ఉద్గారాల వల్లేనని ఆ అధ్యయనం తేల్చిచెప్పింది. సొంతంగా పెట్టుబడి పెట్టి కర్బన ఉత్పత్తులను నిర్వహిస్తున్న బి, చెవ్రాన్, కొనకొఫిలిప్స్, ఎక్సాన్‌మొబిల్, పీబాడి, షెల్ వంటి సంస్థలవల్ల పెరిగిన ఉష్ణ్రోగ్రతలలో 16 శాతం మేరకు, సముద్రమట్టాల పెరుగుదలలో 11 శాతం మేరకు కారణమయ్యాయని ఆ అధ్యయనంలో తేలింది. ‘క్లైమేట్ చేంజ్’ అన్న వైజ్ఞానిక పత్రికలో ఈ అధ్యయనం వివరాలును ప్రచురించారు. సహజవాయులు, చములు, బొగ్గు, సిమెంట్ పరిశ్రమల వల్లే కర్బన ఉద్గారాల పర్యావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. 1880-2010, 1980-2010 మధ్య రెండు దశలుగా ఆయా సంస్థల ఇంధన శిలాజాల వినియోగం, వాటివల్ల వెలువడిన కర్బన, మిథేన్ వాయువుల పరిమాణం, ఫలితాలను గణించారు. ది క్లైమేట్ అకౌంటబిలిటీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన రిచర్డ్ హెడే ఈ అధ్యయనాన్ని 2014లో నిర్వహించారు. ఆ వివరాలు సెప్టెంబర్ 7న ప్రచురితమైనాయి. ప్రపంచంలో ఎక్కువగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్న 90 అగ్ర సంస్థల వల్ల 1880 నుంచి భూ ఉపరితల వాతావరణంలో 50 శాతం మేరకు బొగ్గుపులుసు వాయువు, 57 శాతం మేరకు భూతాపం, 30 శాతం మేరకు సముద్రమట్టాల పెరుగుదల చోటుచేసుకున్నాయని తేలింది. దశాబ్దం క్రితం వరకు ఏ సంస్థ కూడా దీనికి బాధ్యత వహించకపోవడం గమనార్హమని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న మైలెస్ అలెన్ పేర్కొన్నారు. నిజానికి పర్యావరణానికి హానికలిగిస్తున్నవారెవరు? అందువల్ల ఎదురయ్యే కష్టాలను అనుభవిస్తున్నవారెవరు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం కోసం అభివృద్ధి చెందిన దేశాలు 140 నుంచి 300 బిలియన్ డాలర్లు మొత్తాన్ని వెచ్చిస్తే 2030 నాటికి కాస్తంత మెరుగైన పరిస్థితులు నెలకొనవచ్చు. 2015లో జరిగిన పారిస్ ఒప్పందం (కాప్21) 4పకారం 2030నాటికి కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గేలా చూడాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఈ ఒప్పందం నుండి అమెరికా తప్పుకుంది. పర్యావరణానికి హానికలిగించే పరిశ్రమలు నిర్వహిస్తున్న దేశాల్లో చైనా, అమెరికా తొలిరెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

- రవళి