బిజినెస్

శాంసంగ్ ఫోన్స్ పండుగ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ శాంసంగ్ పండుగ ఆఫర్లను ఆవిష్కరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా శాంసంగ్ ఇండియా ‘నెవర్ మైండ్ ఆఫర్’ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన 12 నెలల లోపు ఒకసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుం దని శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్సీ అన్నారు. ఈ మరమ్మతు సమయంలో రూ.990 చెల్లించడం ద్వారా ఒన్ టైమ్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇటీవల ఆవిష్కరించిన గెలాక్సీ జె7ప్రో, గెలాక్సీ జె7 మ్యాక్స్ రెండూ కూడా సరికొత్త ఫీచర్లను అందిస్తున్నాయని తెలిపింది. శాంసంగ్, మొబైల్ వాలెట్స్ అయిన పేటిఎం, మొబిక్విక్‌తోపాటు ప్రభుత్వం యొక్క యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్‌ను శాంసంగ్ పే ప్లాట్‌ఫామ్‌పై అనుసంధానించిందని తెలిపారు.