ఆంధ్రప్రదేశ్‌

దసరా ఉత్సవాలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు ఈ సారి మరింత పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు చెప్పారు. శుక్రవారం దుర్గమ్మ దర్శనానంతరం ఆయన మీడియాతో ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాత్రి, పగలు పోలీస్‌శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలాఉంటే అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ దుర్గమ్మ కృపతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనించాలని తాను కోరుకున్నట్టు చెప్పారు. గత మూడేళ్లలో దుర్గగుడి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అమ్మవారి కృపతో రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టులతోపాటు అనేక పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెందుతోందన్నారు. మరిన్ని ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాఉంటే కృష్ణా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం క్యూలైన్లను, పరిసరాలను భక్తులకు కల్పించిన సౌకర్యాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా భక్తులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఉత్సవాల్లో ఎక్కడా అపారిశుద్ధ్య పరిస్థితులు తలెత్తకుండా వెయ్యి మందికి పైగా కార్మికులతో పారిశుద్ధ్య శాఖ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. క్యూలైన్లలో వృద్ధులు, పిల్లలకు ఉచితంగా పాలు అందిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ కార్లు, వీల్‌చైర్ల సౌకర్యం కల్పించామన్నారు.