విజయనగరం

అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, సెప్టెంబర్ 25: ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. గజపతినగరం వెలుగు కార్యాలయంలో రెండు కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని, ఇందుకు బాధ్యులైన వారిని వదిలేది లేదంటూ రెండు రోజులు కిందట ఎమ్మెల్యే నాయుడు బహిరంగ సమావేశంలో ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం డిఆర్‌డిఎ పిడి సునీల్‌రాజ్‌కుమార్ స్థానిక వెలుగు కార్యాలయానికి రావడం, మిగిలిన సిబ్బంది హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్ర్తినిధి, పసుపుకుంకుమ నిధులలో అక్రమాలు జరిగినట్లు తేలిందని, ఇందుకు బాధ్యులైన అప్పటి ఎపిఎం శేషగిరిరావు, క్లస్టర్ కో-ఆర్డినేటర్ రత్నంలను సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వేరే జిల్లాలో పనిచేస్తున్న ఎపి ఎం.శేషగిరిరావుకు సస్పెండ్ ఉత్తర్వులు పోస్టుద్వారా పంపిస్తామని తెలిపారు. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదన్నారు. పసుపుకుంకుమకింద 50గ్రూపులకు మూడువేల రూపాయల చొప్పున అందాల్సి ఉందని, మూడు రోజులలో ఆ మొత్తాలను ఆయా గ్రూపు సభ్యులకు చెల్లించాలన్నారు. స్రీనిధికి సంబంధించి ఇంకా రూ.8.96 లక్షలు రికరీ రావాల్సి ఉందన్నారు. కెంగువ, ఎం.వెంకటాపురం, రోళ్లపాలెం, ఎం.కొత్తవలస సంఘాలను మార్చాలని ఆదేశించారు.

గిరిజనుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురం, సెప్టెంబర్ 25: గిరిజనుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం ఐటిడి ఎ గిరిమిత్ర సమావేశ మందిరం నుండి నిర్వహించిన వీడియో కానె్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు అసరమైన చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే మలేరియా నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమ తెరలను సక్రమంగా అందరూ వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరిగేషన్, విద్య, హౌసింగ్, వెలుగు, వ్యవసాయం, పండ్లతోటల పెంపకం తదితరశాఖల అధికారులతో ఆయాశాఖల ప్రగతి గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఆర్డీవో సుదర్శనదొర, డిప్యూటీ డి ఎం హెచ్ ఒ డాక్టర్ దీపక్, పి ఎవోశ్రీనివాసరావు, మలేరియా అధికారులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్‌బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
* సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 25: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుతెలిపారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లకు, కస్టమర్లకు చివర పేమెంట్ అందేవరకూ అండగా ఉంటామని చెప్పారు. పట్టణంలో అమర్‌భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు సిపిఐ మద్ధతుగా ఉందని, భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ పోరాటం చేస్తామన్నారు. అగ్రిగోల్ట్ కస్టమర్స్, ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవి నాయుడు మాట్లాడుతూ అగ్రిగోల్ట్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మార్చినెలలో చేసిన ఆమరణ దీక్షల పోరాటం వల్ల చనిపోయిన బాధితులకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియోను సాధించామన్నారు. కస్టమర్లకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సూరప్పడు, యూనియన్ నాయకులు గెంబలి శ్రీనివాసరావు, పి.ఈశ్వరనారాయణ, సిహెచ్.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.