క్రీడాభూమి

కొనసాగుతున్న భారత్ పతకాల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 8: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ పతకాల వేట కొనసాగుతున్నది. ఆర్చర్లు, రెజ్లర్లు, వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణించి, పతకాలను అందించారు. మొత్తం మీద సోమవారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 70 పతకాలతో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. వీటిలో 46 స్వర్ణం, 18 రజతం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. శ్రీలంక 11 స్వర్ణం, 25 రజతం, 23 కాంస్యాలతో మొత్తం 59 పతకాలను కైవసం చేసుకొని రెండో స్థానంలో ఉంది.
రెజ్లింగ్‌లో టాప్: రెజ్లింగ్‌లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. మొత్తం 16 స్వర్ణాలకు పోటీలు జరగ్గా, 14 పతకాలను కైవసం చేసుకొని, తనకు తిరుగులేదని నిరూపించింది. సోమవారం జరిగిన ఆరు ఈవెంట్స్‌లో ఐదింటిలో భారత్‌కు స్వర్ణాలు లభించాయి. మహిళల 75 కిలోల విభాగంలో కబితా దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది. శ్రీలంకకు చెందిన విక్రెమసింఘె అషినీ సురాంగి ముదియాన్ సెలాంగ రజత పతకాన్ని అందుకోగా, బంగ్లాదేశ్‌కు చెందిన ఫిరోగా ఫర్వీన్‌కు కాంస్య పతకం దక్కింది.
సైక్లింగ్: సైక్లింగ్‌లో సోమవారం జరిగిన రెండు ఈవెంట్స్‌లోనూ భారత్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని, ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. పురుషుల 70 కిలోమీటర్ల టీం టైమ్ ట్రయల్‌లో అరవింద్ పన్వర్, మన్జీత్ సింగ్, దీపక్ కుమార్ రాహి, మనోహర్ లాల్ బిష్ణోయ్ సభ్యులుగా గల భారత జట్టు 29 నిమిషాల 37.840 సెకన్ల కాలంలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అదే విధంగా మహిళల 40 మీటర్ల టీం ట్రయల్ ఫైనల్‌లో బిద్యాలక్ష్మి, రుతుజా సత్పతే, మనీష, చావోబా దేవిలతో కూడిన భారత జట్టు 59.23 నిమిషాల్లో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని అందుకుంది. సోమవారం స్వర్ణాలను సాధించిన వారిలో బిద్యాలక్ష్మి 30 కిలోమీటర్ల ఇండివిజువల్ టైమ్ ట్రయల్, అరవింద్ పురుషుల 40 కిలోమీటర్ల ఇండివిజువల్ టైమ్ ట్రయల్‌లో విజేతలుగా నిలిచారు. ఆదివారం స్వర్ణ పతకాలతో రాణించిన వీరిద్దరూ మరోసారి తమ ప్రతిభ కనబరిచారు.
అథ్లెటిక్స్: శాగ్‌లో భారత అథ్లెట్లకు మంగళవారం నుంచి పరీక్ష మొదలుకానుంది. ఇప్పటి వరకూ వివిధ క్రీడాంశాల్లో భారత్ ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు దూసుకెళుతున్నది. అథ్లెటిక్స్‌లోనూ ఇదే దూకుడును కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తిని రేపుతున్నది. గత శాగ్‌లో భారత్ 10 స్వర్ణం, 11 రజతం, 8 కాంస్య పతకాలను సాధించింది. ఈసారి ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.

చిత్రం... మహిళల వెయట్‌లిఫ్టింగ్
75 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన కబితా దేవి