ఆంధ్రప్రదేశ్‌

రేషన్ సరకులు పక్కదారి పట్టనివ్వం: ప్రత్తిపాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 11: అర్హులైన పేదల పొట్టకొట్టి రేషన్ సరకులు పక్కదారి పట్టిస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. విశాఖలో బుధవారం పర్యటించిన ఆయన పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి, వాస్తవాలు చూసి నివ్వెర పోయారు. సమయ పాలన పాటించని, రికార్డులు సరిగా నిర్వహించని సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రేషన్ షాపు తాళాలు బద్దలు కొట్టించి మరీ సరకులు, రికార్డులు పరిశీలించారు. మంత్రి సందర్శనలో భాగంగా మూడు రేషన్ షాపులను సందర్శించగా ఏ ఒక్కరూ నిబంధనల మేరకు ఉదయం 10 గంటలకు షాపులు తెరవలేదు. మంత్రి పక్కనే ఉండి ఒక రేషన్ డీలర్‌కు ఫోన్ చేయించగా, తాను దూరంగా ఉన్నానని, గంట తరువాత రావాల్సిందిగా చెప్పడంతో కంగుతిన్నారు. దీంతో రేషన్ షాపు తలుపులు పగలగొట్టించి రికార్డులు తనిఖీ చేసి అక్రమాలను నిర్ధారించారు. మరో డీలర్ కార్డుదారులకు సరకులు ఇవ్వట్లేదని గర్తించారు. విడిపించిన సరకులకు, పంపిణీ చేసిన వాటికీ ఎక్కడా పొంతన కుదరలేదు. దీంతో డీలరును ప్రశ్నించారు. మరో మహిళా డీలరుపై కూడా మంత్రి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ దుకాణాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకూ విధిగా తెరచి ఉంచారని ఆదేశించారు.