తెలంగాణ

దేవుడి దయతో బతికి బయటపడ్డాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారులో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఫోన్‌లో కెసిఆర్ పరామర్శ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉండడం వల్లే రోడ్డు ప్రమాదం నుంచి బయటపడగలిగానని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని కారు ప్రమాదానికి గురైందని తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేసి పరామర్శించారు, ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. బుధవారం మంత్రి తలసాని, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్ నూతన భవన నిర్మాణం కోసం అంతయ్యపల్లిలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పాత కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళుతుండగా, కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయలయ్యాయి. ఇలాఉండగా సాయంత్రం సచివాలయం చేరుకున్న మంత్రి తలసాని తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉండటం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగానని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.