విశాఖ

తొలుకుల గెడ్డ జలాశయానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, అక్టోబర్ 12: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కినపర్తి పంచాయతీ చుట్టుబంద సమీప తొలుకుల గెడ్డ రిజర్వాయర్‌కు గండి ఏర్పడింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జలాశయం గట్టు కొట్టుకుపోయి గండి ఏర్పడడంతో జలాశయం దిగువన ఉన్న పంటపొలాలన్నీ నీటమునిగాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగం విషయాన్ని చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ దుచ్చర చిట్టిబాబు దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన జలాశయానికి ఏర్పడిన గండిని పరిశీలించి దానిని త్వరితగతిన పూడ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఎస్. ఎం. ఐ. జె. ఇ. రామకృష్ణను కోరారు. దీంతో గురువారం ఉదయం ఎ. ఇ. చిట్టిబాబుల ఆధ్వర్యంలో గ్రామస్తులు గండి పూడ్చేందుకు ప్రయత్నించారు. నీరు అధికంగా ఉండడంతో, ఇబ్బందులు తలెత్తడంతో కొద్దిమేర నీరు తగ్గగానే పూర్తి స్థాయిలో గండిని పూడ్చే విధంగా చర్యలు తీసుకుంటామని జె. ఇ. తెలిపారు. గండిని పూడ్చేందుకు రెండు ట్రాక్టర్లు, మిషన్లతో మట్టిని అడ్డంగా వేసి ఇసుక బస్తాలను పేర్పించినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం కానరాలేదు. గతంలో 2012లో సైతం ఇదే విధంగా గండి పడడంతో అప్పటి పి. ఓ. మరమ్మతులకై మూడు లక్షల నిధులు మంజూరు చేసారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం అధికంగా ఉండడం, జలాశయం విస్తీర్ణం అధికంగా ఉండడంతో దీని మరమ్మతులకై మరిన్ని నిధులతో మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చిట్టిబాబు జె. ఇ.ని కోరగా దీని మరమ్మతులకై 30 లక్షలతో అంచనా నివేదికలు తయారు చేసి నివేదించడం జరిగిందని, వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.