తెలంగాణ

డిసెంబర్ 12 నుంచి తెలుగు మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుంచి 15 వరకు ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభలపై నిర్వహించిన సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు భాషా సాహిత్యం, తెలంగాణ భాషా సాహిత్యం, సంస్కృతిని ఇనుమడింప చేయడం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఉద్దేశ్యమని అన్నారు. ఈ ఉత్సవాలను తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవీంద్రభారతి, భారతి విద్యాభవన్, హరిహర కళాభవన్‌లో తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సభల నిర్వహణకు ప్రభుత్వం కమిటీని నియమించిందని తెలిపారు.దేశ విదేశాల నుంచి సాహితీ ప్రియులు, భాషా ప్రియులు, ప్రముఖులు ఈ సభల్లో పాల్గొంటారని తెలిపారు. సిఎం కెసిఆర్ భాషాభిమాని అయినందున కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు మహాసభలు నిర్వహించాలని ఆదేశించారని చెప్పారు.