రాష్ట్రీయం

ఐదుగురి ఆత్మ‘హత్య’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నార్సింగ్, అక్టోబర్ 17: హైదరాబాద్ నగరశివారులో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు, ఇద్దరు బంధువులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శీతల పానీయంలో విషం కలుపుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చెట్ల పొదల్లో ముగ్గురి మృతదేహాలు, రెండు కిలోమీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో ఇది ఆత్మహత్యనా? లేదా.. ఎవరైనా విషం ఇచ్చి హత్య చేశారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. శంషాబాద్ డిసిపి పద్మజ నార్సింగ్ పోలీసులతో కలసి సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ముగ్గురి మృతదేహాల వద్ద విషం కలిపిన బాటిళ్లను గుర్తించారు. ఓ కారులో ఉన్న మరో రెండు మృతదేహాల వద్ద కేక్ బాక్స్‌ను గుర్తించారు. నార్సింగ్ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో మంగళవారం ఈ సంఘటన వెలుగు జరిగింది. సంగారెడ్డి అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తూ, రాంచంద్రాపూర్ అశోక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. రవీందర్‌రెడ్డి ఐఐటిడబ్ల్యు సిగ్నోర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా వీరిద్దరు సమీప బంధువులు (తోడల్లుళ్లు) అయితే ప్రభాకర్‌రెడ్డితో కలసి రవీందర్‌రెడ్డి స్టాక్ బ్రోకర్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల వ్యాపారంలో నాలుగు కోట్ల మేరకు నష్టం రావడంతో ఇటీవల ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డికి రూ. 90 లక్షలు
ఇచ్చినట్టు తెలిసింది. కాగా సోమవారం రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి (40), కుమార్తె సింధూజ (16), ప్రభాకర్‌రెడ్డి (28) ఆయన భార్య మాధవి (25) కొడుకు వశిష్ట్(2)లు కలసి సోమవారం శ్రీశైలం వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి ఓ కారులో వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. కాగా సోమవారం సాయంత్రం డిండి ప్రాజెక్టు వద్ద ఉన్నామని, తిరుగు ప్రయాణమయ్యామని రవీందర్‌రెడ్డికి ఫోన్ చేసి ఫోన్లన్నీ స్విచ్చ్ఫా చేశారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు సోమవారం రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టగా మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కొల్లూరు సమీపంలోని చెట్ల పొదల్లో, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐదుగురి మృతదేహాలను కనుగొన్నారు. మృతుల కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఈ సంఘటనతో రామచంద్రాపూర్, అమీన్‌పురలో విషాదఛాయలు అలుముకున్నాయి. సైబరాబాద్ కమిషనర్ శాండిల్య, డీసీపీ విశ్వప్రసాద్, జానకి షర్మిల సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్‌పల్లి మండలం కొల్లూర్ ఇంద్రారెడ్డి కంచె ప్రాంతం ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో ముగ్గురు మహిళల మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందిందని, అదేవిధంగా బ్రిడ్జి సమీపంలో మరో ఇద్దరి మృతదేహాలు కనుగొన్నట్టు చెప్పారు. మృతులంతా సంగారెడ్డి అమీన్‌పుర గ్రామానికి చెందిన వారుగా గుర్తించి, వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతదేహాల వద్ద విషంతో కలిపిన కూల్‌డ్రింక్, కేక్ ఉండడంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదా.. ఎవరైనా విషం కలిపి హత్య చేశారా? అనే కోణం నుంచి దర్యాప్తు జరుపుతున్నామని, మృతదేహాల వద్ద లభించిన బాటిళ్లు, కేక్ పార్శిల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, ల్యాబ్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఇదిలావుండగా ప్రభాకర్‌రెడ్డి బంధువు రవీందర్‌రెడ్డిని పోలీసులు విచారించగా తాము వ్యాపారం చేసేది వాస్తవమేనని, ఆర్థిక ఇబ్బందులేవీ లేవని చెప్పారు. అదేవిధంగా తమకు ఎవరితోనూ గొడవలు లేవని స్పష్టం చేశారు.

చిత్రాలు..ఓఆర్‌ఆర్ పొదల్లో పడివున్న మృతదేహాలు.* సంఘటనా ప్రాంతంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు