జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన నటుడు రాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ శనివారం ఇక్కడ కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, దీంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథమే మారిపోయిందని, అందువల్లనే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రాహుల్ రాయ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. దేశాభివృద్ధి కోసం తాను పని చేయాలని నిర్ణయించుకున్నానని, ఇందుకోసం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. రాయ్ తన 22వ ఏట 1990లో ‘ఆషికి’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు.