హైదరాబాద్

మహానగరంలో ఆధునిక టాయిలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 19: అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మహిళల కోసం వెయ్యికి పైగా టాయిలెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉప్పల్ చౌరస్తాలో షీ-టాయిలెట్‌ను కార్పొరేటర్లు అనలారెడ్డి, సరస్వతి, స్వప్న, జ్యోత్స్న, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యాదగిరి రావు, ఏఎంహెచ్‌ఓ డాక్టర్ ఉమా గౌరీతో కలిసి ప్రారంభించారు. టాయిలెట్లను గౌరవ గృహాలుగా వ్యవహరిస్తున్న పబ్లిక్ టాయిలెట్లు ప్రస్తుతం 382 ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో 382 బీఓటీ టాయిలెట్లు, 109 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్, 46 సులభ్, 57 ఇంజనీరింగ్, 15-షీటాయిలెట్లు, 20 కమ్యూనిటీ టాయిలెట్లు ఉండగా వీటికి తోడు మరో 74 టాయిలెట్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గాంధీగిరి ద్వారా నగరంలోని పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉచితంగా టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునేలా యాజమాన్యాలను ఒప్పించామని పేర్కొన్నారు. ప్రతి షీ-టాయిలెట్ నిర్వహణకు మహిళా అటెంట్లను నియమించామని అన్నారు.

పురాణం సేవలు ప్రశంసనీయం
కాచిగూడ, నవంబర్ 19: పురాణం సుబ్రహ్మణ్య శర్మ 21వ సంస్మరణ సభ 70మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా జరిగింది. మేగజైన్ జర్నలిజానికి పురాణం అందించిన సేవలను వక్తలు ప్రశంసించారు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఎడిటర్‌గా ఆంధ్రజ్యోతి వారపత్రికకు పురాణం చేసిన సేవలను వివరించారు. సాహిత్య కృషిని వేదగిరి రాంబాబు, పురాణం హాస్యచతురతను పులిగడ్డ విశ్వనాథరావు వివరించారు. భిన్నకోణంలో పురాణాన్ని కస్తూరి మురళీకృష్ణ ఆవిష్కరించారు. యాదగిరిరావు గొడుగు, నగరూరి పద్మ, మరింగంటి రంగాచార్యులు, పురాణం శ్రీనివాస శాస్ర్తీ పాల్గొన్నారు. కోకిలమ్, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా వద్ద సిపిఎం ఆఫీసు ఎన్‌వీ భాస్కరరావు భవన్‌లో సభ జరిగింది. ‘ఇల్లాలి ముచ్చట్లు’ హాస్యాన్ని వర్ణించారు.