శ్రీకాకుళం

చంద్రన్న భీమాలో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, నవంబర్ 23: ప్రతి ఒక్క కుటుంబం చంద్రన్న భీమా పథకంలో భాగస్వాములు కావాలని భీమా మిత్ర సుజాత స్పష్టం చేసారు. మండలంలోని బందరువానిపేట, వమరవెల్లి పంచాయతీ సుగ్గుదాలినాయుడుపేటల్లో వివిధ కారణాలుగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న భీమా పథకం ద్వారా తక్షణ సహాయంగా రూ.5వేలు అందజేసారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో ఈ మొత్తాలను బాధిత కుటుంబాలకు అందజేసారు. వమరవెల్లి పంచాయతీ సుగ్గుదాలినాయుడుపేటలో పాముకాటుతో మృతి చెందిన కల్లి నాయుడు కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5వేలు రూపాయలును స్తానిక సర్పంచు లోపింటి భవాని చేతులు మీదుగా అందజేసారు. అదేవిధంగా బందరువానిపేట గ్రామానికి చెందిన దుమ్ము పోలయ్య కుటుంబానికి స్థానిక పంచాయతీ ప్రతినిధి గనగళ్ల అప్పారావు, మాజీ సర్పంచు గుంటు లక్ష్మయ్యలు చేతులు మీదుగా రూ.5వేలును అందజేసారు. ఈ సందర్భంగా భీమా మిత్ర మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు చంద్రన్న భీమా ఎంతగానో ఆర్ధిక భరోసా అందజేస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరు చంద్రన్న భీమాలో భాగస్వాములు కావాలన్నారు.

సామూహిక తులసీదళార్చన
* ఘనంగా సత్యసాయి వేడుకలు
గార, నవంబర్ 23: మండల కేంద్రంతో పాటు బోరవానిపేట, శ్రీకూర్మం పంచాయతీ గ్రామాల్లో గురువారం సత్యసాయి 92వ జన్మదిన వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. గారలో కన్వీనరు కింతలి ఈశ్వరరావు, చందర్రావు, ప్రసాదరావు, భాస్కరరావులు ఆధ్వర్యంలో సత్యసాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా బోరవానిపేటలో డా.రౌళో ఆధ్వర్యంలో భక్తులు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలు సందర్భంగా నాటి ఉదయం 5గంటలకు స్వామివారి ఓంకారం, సుప్రభాత సేవ, నగరసంకీర్తన కార్యక్రమాలుతో భక్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తులసీదళంతో స్వామివారి అర్చన కార్యక్రమాల్లో పాల్గోన్న భక్తులు సత్యవ్రతాలు నిర్వహించారు. అదేవిధంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసములు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. నాటి సాయంత్రం 4గంటలకు భక్తులు వెంటరాగా స్వామినామంతో సంకీర్తన గావించారు. అదేవిధంగా బోరవానిపేటలో బాలవికాస్ విద్యార్ధులచే నిర్వహింపజేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా స్వామివారి 92వ జన్మదినం సందర్భంగా 92జ్యోతులను ప్రజ్వలన గావించిన అనంతరం ఊయలోత్సవం నిర్వహించి మంగళహారతితో స్వస్తిపలికారు.