ఖమ్మం

అనుమతి లేకుండా కట్టడాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలోనే అధిక ఆదాయం దక్కించుకుంటున్న కార్పొరేషన్‌గా ఖమ్మంకు పేరుంది. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విడుదల చేసిన నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ అనేక మంది కార్పొరేషన్ అనుమతులు తీసుకోకుండానే భారీ నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్‌లను ఎగ్గొడుతున్నారు. ఇంకా కొందరు కార్పొరేషన్ పరిసరాల్లోనే ఇళ్ళను నిర్మిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. వీటికి అనుమతులు లేకున్నా కొన్ని ఫైనాన్స్ సంస్థలు రుణాలు కూడా మంజూరు చేస్తున్నాయి. శ్రీరాంహిల్స్ సమీపంలో కొందరు సుమారు రెండెకరాల స్థలంలో ఇళ్ళు నిర్మిస్తున్నారు. అలాగే బల్లేపల్లి సమీపంలో మరికొందరు, గొల్లగూడెం వద్ద ఇంకొందరు ప్రత్యేకంగా డూప్‌లెక్స్ ఇళ్ళను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకపోగా కార్పొరేషన్‌కు ఎటువంటి రుసుము చెల్లించలేదు. అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు వాటిపై దృష్టి పెట్టడంలేదు. అనధికారికంగా ఇళ్ళను గేటెడ్ కమ్యూనిటీ పేరుతో నిర్మిస్తుండగా ఆ ప్రాంత కార్పొరేటర్లు కాని, కార్పొరేషన్ అధికారులు కాని స్పందించడం లేదు.
ఇదిలా ఉండగా అనధికార ఇళ్ళ నిర్మాణాలను అధికారులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదు. ఆ ప్రాంత కార్పొరేటర్‌తో పాటు అధికార పార్టీ పెద్దల అండదండలతోనే ఇవి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పెద్దఎత్తున నగదు చేతులు మారిందని, ఆ ఇళ్ళపై అధికారులు ఎటువంటి దాడులు చేయరని విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది. అనధికార ఇళ్ళ నిర్మాణాల సమీపంలోనే సదరు కార్పొరేటర్లతో పాటు కొందరు కార్పొరేషన్ అధికారులు కూడా నివాసముంటున్నా స్పందించడంలేదు. వీటన్నింటిపై ఖమ్మం నగరానికి చెందిన ఓ సంస్థ ప్రత్యేక నివేదికను తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నది. జిల్లా అధికారులు, అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో చర్యలు తీసుకోవడం లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే కొందరు కార్పొరేషన్ కమిషనర్ సందీప్‌కుమార్‌ఝాకు ఫిర్యాదు చేశారని, ఆయన దీనిపై విచారణ జరుపుతామని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి వెనకున్న నేతల వివరాలు బహిర్గతం చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.