అవీ .. ఇవీ..

విహంగవీక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోగ్రఫీ ఓ కళ. అద్భుతమైన దృశ్యాలను చూడటం, దానిని లెన్స్‌లో బంధించడం సాదాసీదా వ్యవహారం ఏమీకాదు. పైగా ఎదురుగా కనిపించే దృశ్యాలను కెమెరాతో క్లిక్‌మనిపించడంలో కిక్ ఏముంటుంది. ఆకాశంలో దాదాపు 7500 అడుగుల ఎత్తున హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ భూమిపై కనిపించే అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో అంత చక్కగానూ బంధించడానికి ఎంత ధైర్యం ఉండాలి. సాహసంతోపాటు డబ్బూ ఉండాలి. లాస్‌ఏంజిలిస్‌కు చెందిన జె.పెన్‌సెన అనే ఫొటోగ్రాఫర్ అలా హెలికాప్టర్‌లో వెళుతూ ఫొటోలు తీయడంలో నేర్పరి. లాస్‌ఏంజిలిస్ విమానాశ్రయంలో లాండ్ అవడానికి సిద్ధమవుతున్న ఓ భారీ విమానాన్ని, దిగువనున్న భవన సముదాయాన్ని, ఎయిర్‌పోర్ట్ అందచందాలను క్లిక్‌మనిపించాడు... ఏడున్నర వేల అడుగుల ఎత్తునుంచి. అక్కడితో అతడు ఆగిపోలేదు. స్పెయిన్‌లోని మల్లోర్కా అందచందాలకూ లెన్స్‌పట్టాడు. తను ముచ్చటపడి తీసిన ఫొటోలను తన పేరుపైనే ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో లోడ్ చేయడం అతడి హామీ. ఆ ఫొటోలను చూసి మెచ్చనివారుండరంటే నమ్మాలి.