ఆంధ్రప్రదేశ్‌

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 4: దక్షిణ అండమాన్‌ను అనుకుని బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలియచేశారు. ఇది 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తావైపు రానుందని చెప్పారు. దీని ప్రభావం వలన ఈనెల 6,7,8 తేదీల్లో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి. అయితే, ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తీర ప్రాంత అధికారులను, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.