ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో మైనార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: భారతదేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో మైనార్టీ వర్గాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని భారతీయ జనతా మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ అన్నారు. మైనార్టీలుగానున్న ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులందరూ సమానంగా అభివృద్ధి చెంది దేశాభివృద్ధికి తోడ్పడాలని భారతీయ జనతాపార్టీ ఆకాంక్షిస్తుందని గురువారం జరిగిన భారతీయ జనతా మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన అబ్దుల్ రషీద్ అన్సారీ అన్నారు. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో వారికి ఓటు బ్యాంకుగా మైనార్టీలను వాడుకున్నప్పటికీ, విద్యారంగంలో ఎంతో వెనుకబడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా విద్యాబోధన పథకాలు చేపట్టడం వల్ల మైనార్టీలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనేది సంతోషకరమైన పరిణామన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్ ఆధారంగా దేశంలో మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతంలో విద్యాసంస్థలు లేకపోయినప్పటికీ అక్కడ విద్యా సదుపాయాల్ని కల్పించటమే కాకుండా మదరసాల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయడంతోపాటు కంప్యూటర్ కోర్సులు కూడా ప్రారంభించిన ఘనత భారతీయ జనతా ప్రభుత్వానిదేనన్నారు.