అదిలాబాద్

రూ.15 కోట్ల నిధులతో తండాలకు రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 15: జిల్లాలోని మామడ, సారంగాపూర్, దిలావర్‌పూర్ మండలాల్లోని అన్ని గిరిజన తాండాల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం సారంగాపూర్ మండలంలోని పొట్యా గ్రామ పంచాయతీరాజ్ రోడ్డు నుండి బండరేవు తాండావరకు రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే నాగాపూర్ గ్రామంలో రూ.65 లక్షల నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ మామడ, సారంగాపూర్ మండలాల్లోని అన్ని తాండాల్లో రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే గిరిజన సబ్‌ప్లాన్ కింద ఈ నిధులు మంజూరుకానున్నాయని తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద ఇప్పచెల్మ అభివృద్దికి రూ.50 లక్షలు మంజూరయ్యాయన్నారు. రైతులు శాస్తవ్రేత్తల, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పంటలు సాగుచేసి ఆర్థికంగా అభివృద్ది చెందాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈనెల 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెవంతాబాయి, వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మెన్ రాజ్‌మహ్మద్, ఎఫ్ ఎసి ఎస్ ఛైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపిపి వెంకటరాంరెడ్డి, ఐటిడిఎ ఈఈ రమేష్, సర్పంచ్ రవి, పీ ఆర్‌డీ ఈ తుకారాం, నాయకులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.