తెలంగాణ

ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 14: ప్రస్తుత రబీ సీజన్‌లో ప్రణాళికాబద్ధంగా నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తూ, ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరం కూడా ఎండిపోనివ్వకుండా కాపాడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతాంగానికి భరోసా కల్పించారు. చివరి ఆయకట్టు వరకు కూడా అవసరమైన మేర నీటిని అందిస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం తానే స్వయంగా జీపు నడిపిస్తూ కోటగిరి, బోధన్ మండలాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి కాల్వల ద్వారా నీటి సరఫరా తీరును పరిశీలించారు. పలుచోట్ల డిస్ట్రిబ్యూటరీలు అస్తవ్యస్తంగా మారి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతుండడాన్ని గమనించిన మంత్రి ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం ప్రదర్శించారు. చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు తామంతా తపన పడుతుంటే, కాల్వల పరిస్థితి గురించి పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులను కూడా మందలించారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదని, వారి పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. డిస్ట్రిబ్యూటరీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న బండరాళ్లు, ముళ్ల కంచెలను యుద్ధ ప్రాతిపదికన తొలగింపజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
తన క్షేత్ర స్థాయి పర్యటనలో ఆయకట్టు రైతులను నేరుగా కలుస్తూ, నిజాంసాగర్ నీరు పంట పొలాలకు వరకు చేరుతోందా? అని అడిగి తెలుసుకున్నారు. చుక్క నీటిని సైతం వృధా చేయకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. నీటి సరఫరా తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద వీఆర్‌ఓ, ఇతర సిబ్బందిని నియమించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా అయ్యేలా చూస్తామన్నారు.
నిజాంసాగర్ పరిధిలోని మొత్తం 82 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగు నీరందిస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి ఎన్ని తడులు అందించాలనేది నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఏడు తడులుగా నీటిని విడుదల చేయాలని తీర్మానించారని, అవసరమైతే మరిన్ని విడతలుగా నీరందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
చిత్రం..నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాల్వల్లో
లోపాలను గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి పోచారం