తెలంగాణ

తెలుగు మహాసభలు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం అయ్యాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. అకాడమీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సభలకు తమ అంచనాలను మించి భాషాభిమానులు వచ్చారని, ఇది తమకు గొప్పబలం చేకూర్చిందన్నారు. 42 దేశాలు, 17 రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం నుండి కూడా ప్రతినిధులు వచ్చారని, ఎనిమిది వేల మందిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన తొలిరోజు సభకు 35 వేల మంది హాజరయ్యారని, చివరి రోజు సభకు దాదాపు 40 వేల మంది హాజరయ్యారన్నారు. మధ్యలో మూడురోజుల పాటు సరాసరిన 15 వేల మంది హాజరయ్యారని తెలిపారు. టివిల ద్వారా ఈ సభలను మన రాష్ట్రంలోని ప్రజలే కాకుండా, ఆంధ్రప్రదేతో సహా వివిధ రాష్ట్రాలు, అమెరికా, బ్రిటన్‌తో సహా అనేక దేశాల నుండి కోట్లాది మంది ప్రజలు వీక్షించారన్నారు. తెలంగాణలో భావకవిత్వం బలంగా ఉందని ఈ సభల ద్వారా నిరూపించగలిగామన్నారు. తెలుగు సాహిత్య వికాసంలో తెలంగాణ పాత్రను నిరూపించగలిగామని పేర్కొన్నారు. తెలంగాణ కవులు, మహనీయుల గొప్పదనాన్ని స్మరించుకున్నామన్నారు. మహనీయుల కృషిని వర్తమాన తరానికి తెలియచేయగలిగామన్నారు. భవిష్యత్తుకు బాట వేసేందుకు బాషా పండితుల సూచనలు, సలహాలను తీసుకుంటామని పేర్కొన్నారు. లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేరాయన్నారు. తెలుగుపై ప్రజల్లో ఉన్న భాషాభిమానం ఈ సభలతో వెల్లడయాయయని తెలిపారు. ఈ మహాసభలు తెలంగాణ సాహిత్య వికాసానికి ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను స్ఫూర్తిగా తీసుకుని, భవిష్యత్తులో రాష్టస్థ్రాయి తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో కూడా తెలుగు సభలు నిర్వహించే అంశం పరిశీలిస్తామన్నారు.