తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరంలో రెండురోజులపాటు జరిగిన యూనియన్ ద్వితీయ మహాసభల్లో తీర్మానం చేసినట్టు వారు తెలిపారు. టీఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఎంతో క్రమశిక్షణ కలిగిందని, సంస్థ అభివృద్ధికే పాటుపడుతుందన్నారు. బుధవారం మహాసభల ముగింపు సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. సకల జనుల సమ్మెకాలానికి ఆర్టీసీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని, ఆర్టీసీలోని కొన్ని విభాగాలను మూసివేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ సమావేశంలో తీర్మానించారు. కార్మికులకు రావలసిన బకాయిలు, కొత్త వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో రాష్టవ్య్రాప్తంగా సుమారు ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ రత్నాకర్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె భాస్కర్‌రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు అహ్మద్ అలీ, వెంకట్‌గౌడ్, కోశాధికారి కె రాంరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, జిఎస్ నారాయణ, త్రిలోచన, వెంకన్న, కాళిదాస్, ఎస్ గోపాల్, సిహెచ్ నర్సయ్య, కెఎస్‌రెడ్డి, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.