తెలంగాణ

తెలుగు తల్లిని, ఎన్టీఆర్‌ను విస్మరించడం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించడం మంచి పరిణామమని, తాము స్వాగతిస్తున్నామని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. అయితే తెలుగు భాషకు జాతీయ స్థాయిలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘మా తెలుగు తల్లికి’ అనే పాటను, తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రపంచ మహాసభల్లో విస్మరించడం భాధాకరమని అన్నారు. తెలుగు తల్లి విగ్రహాన్ని 1975లో మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఉన్న తమిళుడు అయిన కాశీ పాండ్యన్ తెలుగు భాష నుంచి స్ఫూర్తిని పొంది తెలుగు తల్లి విగ్రహాన్ని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేశారని వివరించారు. 75 వేల పుస్తకాలు చదివానని, 3వేల పద్యాలను అనర్గళంగా చెప్పగలనన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ రెండు విషయాలు గుర్తులేవా అని ప్రశ్నించారు. తెలుగు తల్లి విగ్రహం ఒక ప్రాంతమో, ఓ జిల్లాకో సంబంధించింది కాదని కనీసం అధికారులు కూడా ఈ విషయం చెప్పకపోవడం బాధాకరమని అన్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు కేసీఆర్‌కు గుర్తులేవా అని నిలదీశారు. తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు కళాకారులు నుంచి రూ.13 లక్షలు వసూలు చేసి సహాయం చేశారని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానే్న స్థాపించారని అన్నారు. అటువంటి ఎన్టీఆర్‌ను విస్మరించడం చాలా బాధాకర పరిణామమని తెలిపారు. తెలుగు భాషపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో క్లినికల్ ప్రయోగాలు వికటిస్తుండడంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.